Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ ఖరారైంది..టైటిల్ ఆ నలుగురిలో ఒకరికి ఫిక్స్..ప్రస్తుతం టాప్ లో ఎవరు ఉన్నారంటే!

హౌస్ లో ఎలాంటి లవ్ ట్రాక్స్ పెట్టుకోకుండా, గేమ్ మీద మాత్రమే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన కంటెస్టెంట్ ఈయన. అందరితో స్నేహంగా ఉంటాడు, టాస్కులు బ్రహ్మాండంగా ఆడుతాడు. కానీ గత వారం నిఖిల్, పృథ్వీ తో పోలిస్తే ఆట విషయంలో కాస్త తగ్గాడు కానీ, మనిషిగా ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసాడు. రాబోయే ఎపిసోడ్స్ లో కాస్త ఆట ఫైర్ చూపిస్తే ఇతనికి కూడా టైటిల్ కొట్టే అవకాశాలు ఉంటాయి.

Written By: Vicky, Updated On : October 27, 2024 10:58 am

Bigg Boss 8 Telugu(66)

Follow us on

Bigg Boss 8 Telugu: అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడే 8 వారాలు పూర్తి చేసుకొని, 9వ వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లోకి తొలుత 14 మంది అడుగుపెట్టారు. వారిలో 8 మంది ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్, పృథ్వీ,యష్మీ, ప్రేరణ, నబీల్ మరియు విష్ణు ప్రియ మిగిలారు. ఇక ఆ తర్వాత 8 మంది వైల్డ్ కార్డ్స్ ద్వారా అడుగుపెట్టారు. వీరిలో ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో ఎవరికీ టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎవరు టాప్ 5 లో ఉంటారు అనేది వాళ్ళ ఆట తీరుని బట్టి, సోషల్ మీడియా లో జరుగుతున్న పొలింగ్స్ ని బట్టి ఒక విశ్లేషణ చూద్దాం. టాప్ 5 లో ఈసారి మొత్తం ఓజీ క్లాన్ సభ్యులే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ రాయల్ క్లాన్ నుండి టేస్టీ తేజ, గౌతమ్ కి టాప్ 5 లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్లకు పృథ్వీ కూడా సవాలు విసీరుతున్నాడు. ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే టాప్ 4 స్పాట్స్ ఫిక్స్ అయిపోయాయి. వీళ్ళ నలుగురికి టైటిల్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.వాళ్లెవరో ఒకసారి చూద్దాం.

నిఖిల్ :

ఈయన టైటిల్ రేస్ లో ఉంటాడని, టైటిల్ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని మొదటి వారం లోనే అందరికీ అర్థం అయ్యింది. అందరితో మంచిగా ఉండడంతో పాటు న్యాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండడం. టాస్కుల విషయం లో చెలరేగి సింహం లాగా ఆడడం వంటివి ఇతన్ని టైటిల్ రేస్ కి దగ్గరయ్యేలా చేసింది. కానీ ఈమధ్య ఇతగాడు యష్మీ విషయం లో డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. యష్మీ విషయం లో స్పష్టమైన స్టాండ్ తీసుకుంటే కచ్చితంగా ఇతను టైటిల్ కొట్టేస్తాడు. స్పష్టత లేకపోతే కష్టం.\

నభీల్:

హౌస్ లో ఎలాంటి లవ్ ట్రాక్స్ పెట్టుకోకుండా, గేమ్ మీద మాత్రమే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన కంటెస్టెంట్ ఈయన. అందరితో స్నేహంగా ఉంటాడు, టాస్కులు బ్రహ్మాండంగా ఆడుతాడు. కానీ గత వారం నిఖిల్, పృథ్వీ తో పోలిస్తే ఆట విషయంలో కాస్త తగ్గాడు కానీ, మనిషిగా ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసాడు. రాబోయే ఎపిసోడ్స్ లో కాస్త ఆట ఫైర్ చూపిస్తే ఇతనికి కూడా టైటిల్ కొట్టే అవకాశాలు ఉంటాయి.

ప్రేరణ:

ఈ వారం ఓటింగ్ లో అందరికంటే టాప్ లో దూసుకొచ్చింది ఈమె. నిఖిల్ ని కూడా దాటేసింది. టాస్కులలో ఆడపులి లాగా ఆడడంతో పాటు, మనసులో ఏది ఉంచుకోకుండా అనిపించింది మాట్లాడేయడం ఈమెలో ఉన్న మంచి లక్షణం. అలాగే నామినేషన్స్ సమయంలో ఈమె తన కోసం పోరాడే తీరు అందరికీ నచ్చుతుంది. అయితే అప్పుడప్పుడు నోరు జారడం, విష్ణు ప్రియ మీద అసూయ తగ్గించడం వంటివి చేస్తే కచ్చితంగా ఈమెకి కూడా టైటిల్ కొట్టే అవకాశాలు ఉంటాయి.

విష్ణు ప్రియ :

ఈమె ఒక మంచి అమ్మాయిగా ఆడియన్స్ లో మార్కులు కొట్టేసింది. ఎంత మంది తనని ప్రభావితం చేయాలనీ చూసినా, తానూ అనుకున్నదే చేస్తుంది. కానీ టాస్కుల విషయం లో సీరియస్ గా లేకపోవడం. పృథ్వీ మీద ప్రేమ పెంచుకొని అతని వెనుకనే తిరగడం వంటివి ఆడియన్స్ కి చిరాకు కలిగించే విషయాలు. ఇప్పుడు పృథ్వీ తో ఆమెకు గొడవలు అయ్యాయి. కనీసం ఇప్పటి నుండైనా పృథ్వీ కి దూరంగా జరిగి, పూర్తి స్థాయిలో ఆట మీద ఫోకస్ పెడితే మాత్రం, ఈమెను టైటిల్ కొట్టకుండా ఎవ్వరు ఆపలేరు.

పైన చెప్పిన నలుగురు టాప్ 4 స్థానాల్లో ఫిక్స్ అయిపోయారు,వీరిలో ప్రతీ ఒక్కరికి టైటిల్ ని గెలుచుకునేందుకు సమానమైన హక్కు ఉంది. ఇక 5వ స్థానం కోసం యష్మీ, పృథ్వీ, గౌతమ్, టేస్టీ తేజ నిలిచారు. వీరిలో యష్మీ కి టాప్ 3 వరకు వచ్చే సత్తా ఉంది. కానీ గత వారం నుండి ఈమె నిఖిల్ పిచ్చి తో తన ఆటని పాడు చేసుకుంటుంది. నిఖిల్ లేకపోతే చచ్చిపోతాను అనేంతలా ప్రవర్తిస్తుంది. అంతే కాకుండా ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఒకటి చెప్తుంది, మరొకటి చేస్తుంది. ఆట కసిగా ఆడుతుంది, చూసేందుకు చాలా అందంగా ఉంటుంది అనే కానీ, ఈమెలో మొత్తం నెగటివ్ యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మార్చుకోకుంటే ఈమె టాప్ 5 లోకి రావడం కష్టం. ఇక పృథ్వీ విషయానికి వస్తే టాస్కులు ఆడడం లో ఇతన్ని కొట్టేవాడు లేదు. పృథ్వీ రంగంలోకి దూకాడంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. కానీ ఇతనికి కోపం వచ్చినప్పుడు నోరు జారేస్తాడు, అలాగే విష్ణు ప్రియ విషయం లో అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి రెండు ఇతనికి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవి సరి చేసుకుంటే 90 శాతం ఇతనికి టాప్ 5 స్పాట్ ఫిక్స్ అయిపోయినట్టే. అలాగే టేస్టీ తేజ, గౌతమ్ కి కూడా టాప్ 5 లోకి వచ్చే అవకాశం ఉంది. టేస్టీ తేజ కి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే పీఆర్ టీం చాలా తక్కువ. లేకుంటే ఇతను కచ్చితంగా టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఇక గౌతమ్ కూడా టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, యష్మీ ని దూరం పెట్టి సరైన ట్రాక్ లోకి వచ్చాడు. వచ్చే వారం దమ్ముగా ఆడితే ఇతనికి 5వ స్థానం ఫిక్స్ అయిపోతుంది.