https://oktelugu.com/

Coronavirus Saftey Tips :  కరోనా నుంచి మిమ్మల్ని రక్షించే ‘నవరత్నాలు’ ఇవే !

Coronavirus Saftey Tips : కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకు ‘నవరత్నాలు’ అంటుబాటులో ఉన్నాయి. మరి అవేమిటో చూద్దామా ? 1) “నిమ్మకాయ” రోజు నిమ్మకాయ రసం తప్పనిసరిగా త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. కరోనా నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 2) “బాదo” ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తింటే.. విటమిన్ E తో పాటు జలుబు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. 3)”పెరుగు” ప్రతి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 13, 2022 8:14 pm
    Follow us on

    Coronavirus Saftey Tips : కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకు ‘నవరత్నాలు’ అంటుబాటులో ఉన్నాయి. మరి అవేమిటో చూద్దామా ?
    carona

    carona

    1) “నిమ్మకాయ”

    రోజు నిమ్మకాయ రసం తప్పనిసరిగా త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. కరోనా నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

    2) “బాదo”

    ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తింటే.. విటమిన్ E తో పాటు జలుబు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

    3)”పెరుగు”

    ప్రతి రోజు పెరుగును కచ్చితంగా తినండి, అలాగే తేనే కూడా తినండి. ఇది విటమిన్ D మనకు పుష్కలంగా అందుతుంది.

    4) “పసుపు” :

    మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

    5) “పాలకూర” :

    ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. వాటిల్లో పాలకూర అతి ముఖ్యమైనది.

    6)” అల్లం”

    గొంతులో మంటను, వికారాన్ని బాగా తగ్గిస్తుంది.

    7) “వెల్లుల్లి”

    ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా  నిత్యం వెల్లుల్లి  తినండి. కూరల్లో ఎక్కువగా వాడండి.     

    8) “ప్రతిరోజు వాకింగ్ చేయండి”

    వాకింగ్  కూడా శరీరానికి ఫుడ్ లాంటిదే. అలాగే  ఆసనాలు, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ లో కూర్చోండి. తప్పకుండా మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి.

    9) “ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ )” :

    ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కచ్చితంగా ఇవి నిత్యం తినండి. పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోవడం వల్ల కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇవి మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇస్తాయి.