AP Covid: దేశం, తెలుగు రాష్ట్రాలు క్రమంగా థర్డ్ వేవ్ లోకి జారిపోతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏపీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. నిన్నా మొన్నటివరకూ వెయ్యిలోపే ఉన్న కేసులు తాజాగా 4వేలు దాటడం కలకలం రేపుతోంది. కేసులు రోజురోజుకు అధికమవ్వడం చూసి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ కేసులు అధిక మవ్వడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
కరోనా కేసులు అధికమవ్వడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ప్రకటించింది.
ఇక గత 24 గంటల్లో 4438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 14204 యాక్టివ్ కేసులున్నాయి. 14507 మరణాలు సంభవించాయి.బుధవారంతో పోలిస్తే దాదాపు 1143 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇక ఏపీలో కరోనా కారణంగా కృష్ణ, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చనిపోయారు. 24 గంటల్లో 261 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఏపీలోనే అత్యథికంగా తూర్పుగోదావరిలో 932 కేసులు.. ఆ తర్వాత విశాఖపట్నంలో 823 కేసులు నమోదయ్యాయి.
కరోనాను ప్రజలు ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని.. వ్యాక్సిన్ తీసుకున్నా ఏం కాదన్న ధీమాను వీడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం.. మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
#COVIDUpdates: 13/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,89,332 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,621 మంది డిశ్చార్జ్ కాగా
*14,507 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,204#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zy1vcrt1EE— ArogyaAndhra (@ArogyaAndhra) January 13, 2022