https://oktelugu.com/

Food: భోజనం తొందరగా చల్లగా అవుతుందా.. వేడిగా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలంటే?

చలి కాలంలో తొందరగా ఫుడ్ చల్లగా అయిపోతుంది. దీనివల్ల తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. దీనికి సొల్యూషన్ వేడిగా ఉన్నప్పుడే తినడం లేదా ఫుడ్ వేడిగా ఉండేలా చూసుకోవాలి. తిన్న ప్రతీసారి వంట చేయలేం. చేసిన వెంటనే తినే టైమ్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి తినే ఫుడ్ వేడిగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ రోజు చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2024 / 10:34 PM IST

    food

    Follow us on

    Food: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేవలం బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి చంపేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. దీనివల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తున్నాయి. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల చాలా మంది ఈ చలికాలంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం వంటివి చిన్నగా వచ్చిన కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి చెందాలంటే మాత్రం చలికాలంలో ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాలు ఉండే వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ కాలంలో తొందరగా ఫుడ్ చల్లగా అయిపోతుంది. దీనివల్ల తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. దీనికి సొల్యూషన్ వేడిగా ఉన్నప్పుడే తినడం లేదా ఫుడ్ వేడిగా ఉండేలా చూసుకోవాలి. తిన్న ప్రతీసారి వంట చేయలేం. చేసిన వెంటనే తినే టైమ్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి తినే ఫుడ్ వేడిగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ రోజు చూద్దాం.

    సాధారణంగా చలికాలంలో ఎక్కువ మంది చపాతీ తింటారు. ఎందుకంటే చపాతీ అయితే బాడీకి వేడిని ఇస్తాది. దీనివల్ల చలి నుంచి కాస్త విముక్తి చెందుతారు. సాధారణంగా చపాతీ చేసిన ఒక గంట తర్వాత తింటే టేస్ట్ మారిపోతుంది. అందులో చలికాలంలో టేస్ట్‌తో పాటు చల్లగా అయిపోతుంది. దీంతో తినాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. అయితే చపాతీలు ఈ చలికాలంలో చల్లగా ఉండకుండా వేడిగా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టాలి. ఇందులో రోటీ లేదా చపాతీలను పెట్డి ఒక కుండపై పెడితే వేడిగా ఉంటాయి. అలాగే వీటిని పెట్టే బాక్స్‌పైన హీటింగ్ ప్యాడ్ పెట్టిన కూడా రోటీలు వేడిగా ఉంటాయి. అలాగే రోటీలు వేడిగా ఉండటానికి థర్మల్ బ్యాగ్స్‌ ఉపయోగించవచ్చు. ఇందులో ఫుడ్ పెడితే వేడిగా ఉంటుంది. ఈ బ్యాగ్‌లో మీ ఫుడ్ ఉన్న బాక్స్ పెడితే భోజనం ఎక్కువ సమయం వేడిగా ఉండటంతో పాటు టేస్టీగా ఉంటుంది.

    ఇప్పుడైతే ఫుడ్ వేడిగా ఉండటానికి కొత్త రకం బాక్స్‌లు, పద్ధతులు వచ్చాయి. కానీ అప్పట్లో అంతా కూడా నేచురల్‌గానే ఫుడ్‌ను వేడిగా ఉంచేవారు. ఇప్పుడైతే ఎప్పుడు తింటే అప్పుడు వంట చేసేవారు. కానీ పూర్వం రోజుల్లో ఉదయం వండిన ఫుడ్ కూడ రాత్రికి తినేవారు. దీనికి ముఖ్య కారణం పూర్వం రోజుల్లో కాంస్య, ఇత్తడి పాత్రల్లో ఫుడ్‌ను నిల్వ ఉంచేవారు. అందుకే ఫుడ్ వేడిగా ఉండేది. ఇప్పుడు అన్ని స్టీల్ లేదా నాన్‌స్టిక్ పాత్రల్లోనే నిల్వ ఉంచుతారు. వీటి కంటే కాంస్య, ఇత్తడి పాత్రలో ఉండే ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. నాన్‌స్టిక్‌ పాత్రల్లో ఉండే ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.