https://oktelugu.com/

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. పాటించాల్సిన నియమాలివే!

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ నెల విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణువును భక్తితో పూజించడం వల్ల మంచి జరుగుతుందని, కోరిన కోర్కెలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజిస్తారు. తులసీదళాలతో విష్ణువుని పూజించడం వల్ల సకల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2024 / 10:29 PM IST

    Dhanurmasam

    Follow us on

    Dhanurmasam: హిందూ సంప్రదాయంలో ఒక్కో నెలకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇంగ్లీషు నెలల కంటే తెలుగు నెలలనే హిందువులు ఎక్కువగా పాటిస్తుంటారు. శ్రావణం, కార్తీకం మాసాలు చాలా పవిత్రమైనవి. ఈ రెండు మాసాల్లో తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో నెలకి ఒక్కో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అయితే నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ నెల విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణువును భక్తితో పూజించడం వల్ల మంచి జరుగుతుందని, కోరిన కోర్కెలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజిస్తారు. తులసీదళాలతో విష్ణువుని పూజించడం వల్ల సకల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు ప్రారంభం అయ్యి జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ నెల రోజుల సమయాన్నే ధనుర్మాసంగా పిలుస్తారు.

    ధనుర్మాసంలో అందరూ కూడా ఉదయాన్నే లేచి భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా వేంకటేశ్వరుడు, విష్ణువు ఆలయాలకు వెళ్తుంటారు. ఈ నెల రోజుల పాటు దీపం పెట్టడం వల్ల అంతా శుభమే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ నెల రోజుల పాటు విష్ణువును తులసి దళాలతో పూజించాలి. అలాగే చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి. బ్రహ్మ ముహూర్తంలోనే లేచి నదీ స్నానం చేసి విష్ణువును పూజించాలి. కొందరు ఈ నెలలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మద్యం, మాంసం తీసుకోకూడదు. ఇలా నెల రోజులు పాటు భక్తితో విష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో రోజూ శ్రీ విష్ణువుకి తులసి మాలను సమర్పించడం వల్ల వివాహం కానీ వారికి తొందరగా వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.

    ధనుర్మాసంలో పూజిస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి. అయితే ఈ నెలలో అంతగా ఎవరూ శుభకార్యాలు చేయరు. కొత్త దుస్తులు ధరించడం, కొత్త వస్తువుల ఏవీ ఉపయోగించకపోవడం వివాహం, నామకరణం, ఇంటి స్థలం కొనడం వంటివి ఏవీ చేయరు. దీనివల్ల ఈ నెలను శూన్య నెల అని కూడా అంటారు. ఈ నెల మొత్తం భక్తితో విష్ణువుని పూజించాలి. ఈ నెల మొత్తం విష్ణువు ఆలయాలు భక్తులతో కలకలలాడుతాయి. అలాగే వెంకటేశ్వర ఆలయాలు కూడా భక్తులతో నిండిపోతాయి. ముఖ్యంగా ఈ నెలలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ప్రతీ ఒక్కరూ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని పండితులు అంటున్నారు. కాబట్టి అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.