
కరోనా పుట్టినిల్లు వూహాన్ నుంచి భారత్‌కు శుక్రవారం తొలి విమానం బయలుదేరనుంది. దాదాపు 8 నెలల కిందట ఇక్కడ కరోనా వైరస్ పుట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రభుత్వం ‘మిషన్ వందేమాతరం’ కింద స్వదేశానికి చేరవేరుస్తుంది. ఇందులో భాగంగా నేడు వూహాన్ నగరంలోని భారతీయులను తీసుకొస్తుంది. కాగా ఇప్పిటి వరకు ‘మిషన్ వందేమాతరం’ కింద 20 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తెచ్చింది.