
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. జిల్లాలోని ఇల్లందు పట్టణానికి చెందిన భద్రు సౌజన్య అనే యువతిపై జక్కుల సందీప్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమేనని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల విజయవాడలో జరిగిన ప్రేమ హత్య ఉదంత జరిగిన ఘటన మరువకముందే మరోసంఘటన జరగడంపై ఆందోళన చెందుతున్నారు.