Jio Satellite Internet: 2 జీబీకి మించి సామర్థ్యం ఉన్న వీడియో సైతం ఒక నిమిషంలో డౌన్లోడ్ అవుతుంది. బఫరింగ్ లేకుండా వీడియోలు చూసే సౌలభ్యం లభిస్తుంది. నామమాత్రపు సిగ్నల్ ఉన్నా ఎదుటి వ్యక్తి వాయిస్ హై రేంజ్ లో వినిపిస్తుంది. ఎంతటి క్లిష్ట సాధ్యమైన ఫైల్స్ ను సైతం ఈజీగా చూడొచ్చు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న వ్యక్తికి సైతం అత్యంత పారదర్శకమైన వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అసలు ఇవన్నీ మనదేశంలో సాధ్యమవుతాయా? అనే ప్రశ్న కూడా మీ మదిలో ఉదయిస్తోంది కదూ.. కానీ ఇవన్నీ త్వరలో జరుగుతాయి.. అన్ని అనుకున్నట్టు సాగితే కొద్ది రోజుల్లోనే ఈ సౌలభ్యాలు మీ అరచేతిలోకి వచ్చేస్తాయి. 5- జీ టెక్నాలజీ ఫోన్ వాడుతున్న మనం.. త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పొందబోతున్నాం.. ఇంతకీ ఏమిటి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అంటే..
హై స్పీడ్ ఇంటర్నెట్
చవక ధరలో ఇంటర్నెట్ అందించి.. సరికొత్త సాంకేతిక విప్లవానికి దారి తీసిన జియో.. మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడున్న దానికంటే మరింత హై స్పీడ్ ఇంటర్నెట్ ను యూజర్లకు అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. అలాంటి సేవలను సాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా అందించనుంది. దీనికి సంబంధించి జియోకు అనుమతులు లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్ ఫారమ్స్, లక్సెం బర్గ్ SES భాగస్వామ్యంతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది
దీనిని ఆపరేట్ చేసేందుకు భారత స్పేస్ రెగ్యులేటరీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమెజాన్, ఎలన్ మస్క్ స్టార్ లింక్ వంటి సంస్థలు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు పోటీలో ఉన్నాయి. అయితే వాటికి దీటుగా జియో కూడా ఈ రేసులో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బిట్ కనెక్ట్ ద్వారా ఇండియాకు మూడు అనుమతులు మంజూరయ్యాయి. అందులో ఒకటి జియోకు దక్కింది.. ఏప్రిల్ – జూన్ నెలలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN- SPAce) అనుమతులను జారీ చేసింది. ఆర్బిట్ కనెక్ట్స్ భారత్ పై ఉపగ్రహాలను ఉంచేందుకు అనుమతి ఇస్తాయి. ఈ ఉపగ్రహాల ద్వారా జియో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది.
భారీగా పెట్టుబడులు
ఈ సర్వీస్ ప్రారంభించేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ నుంచి జియో ఇంకా మరిన్ని అనుమతులు పొందాల్సి ఉంది..”జియో మాత్రమే కాకుండా, ఇంకా చాలా పెద్ద కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే అనుమతులు పొందాయి. దీనివల్ల శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. వచ్చే ఐదేళ్లలో 36% వార్షిక పెరుగుదలను నమోదు చేస్తుంది. 2030 నాటికి దీనిపై ఆదాయం 1.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని” IN SPACe చైర్మన్ పవన్ గోయెంకా తెలిపారు. “గత ఏడాది ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది కంపెనీల పెట్టుబడి 20 మిలియన్ డాలర్ల నుంచి 30 మిలియన్ డాలర్ల వరకు పెరిగిందని గోయెంకా వివరించారు.. ఇక ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే అమెజాన్ Kuiper ద్వారా దాదాపు పది బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.. ఎలన్ మస్క్ కు చెందిన space x స్టార్ లింక్ ద్వారా శ్రీలంక లో సేవలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.