Milk: పాలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మంది ఉదయం లేవగానే పాలు తాగుతుంటారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కూడా. పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాలు తాగడం వల్ల ఎముకలకు బలం అంటారు నిపుణులు. ఇందులో ఉండే కాల్షియమే దీనికి ప్రధాన కారణం. అయితే వేసవిలో పాలు తాగితే వేడి అంటారు కొందరు. అందుకే వేసవి లో పాలు తాగడమే మానేస్తుంటారు. ఇంతకీ ఎండాకాలంలో పాలు తాగవచ్చా లేదా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాల వల్ల అసిడిటీ కలుగుతుందట. అందుకే ఖాళీ కడుపున పాలు తాగవద్దు అంటారు నిపుణులు. ఖాళీ కడుపుతో పాలు తాగాలి అనుకుంటే ఖచ్చితంగా దానితో ఏదైనా నట్స్ తినండి. దీని వల్ల మీ కండరాలను బలంగా మారుతాయి. ఇక వేసవిలో, చల్లని పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వేడి పాలు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే వేసవిలో వేడి పాలకు బదులుగా చల్లని పాలు అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇక చలికాలంలో గోరువెచ్చని పాలు తాగవచ్చు.
ఇక చాలా మంది వ్యాయామం, వర్కౌట్లు చేసిన తర్వాత లేదంటే ముందు పాలు తాగుతుంటారు. ఇలా చేయవద్దు అంటున్నారు నిపుణులు. అలా కాకుండా వ్యాయామం పూర్తైన అరగంట తర్వాత మాత్రమే పాలు తాగాలట. దీంతో శరీరానికి పోషకాలు అందుతాయి. జలుబు లేదా ఫ్లూ వంటి సమస్యలు ఉంటే చల్లని పాలు తాగకుండా గోరువెచ్చని, వేడి పాలు తాగాలి. దీంతో మీరు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
కొందరికి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే చలికాలంలో మాత్రం గోరువెచ్చిన పాలనే తాగాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయం చేస్తుంది. చలి నుండి రక్షిస్తుంది. వేడి పాలు జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, గ్యాస్ నుంచి దూరంగా ఉంచుతాయి. నిద్రలేమి ఉంటే, రాత్రిపూట గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల నిద్ర వస్తుందట. పాలలో ఉండే అమినో యాసిడ్లు సెరోటోనిన్ , మెలటోనిన్‌లను నియంత్రించి నిద్ర పోయేలా చేస్తాయి పాలు.