U Tax Scam: ఆ తెలంగాణ మంత్రి రూ.950 కోట్ల కథేంటి?

నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మునిసిపల్,ఇతర శాఖల ద్వారా ఆర్ టాక్స్ ని వసూలు చేసేవారన్నారు. ఎవరు కట్టడాలు కట్టినా..అధికారుల ద్వారా గజానికి 75 రూపాయాల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు.

Written By: Neelambaram, Updated On : May 22, 2024 11:57 am

U Tax Scam

Follow us on

U Tax Scam: తెలంగాణలో 950 కోట్ల స్కాం వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ స్కాంకు పాల్పడినట్లు బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రైస్ మిల్లర్లను బెదిరించి ఈ స్కామ్ చేశారన్నారు. అయితే ఇందులో నుంచే ఉత్తంకుమార్ రెడ్డి 500 కోట్లను కాంగ్రెస్ హైకమాండ్ కు సమర్పించుకున్నారన్నారు. ఈ మొత్తం అమౌంట్ ను ఉత్తం కాంగ్రెస్ జాతీయ నేత కేసీ. వేణుగోపాల్ కు ముడుపుల రూపంలో ముట్ట చెప్పినట్లు ఆరోపించారు.

నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మునిసిపల్,ఇతర శాఖల ద్వారా ఆర్ టాక్స్ ని వసూలు చేసేవారన్నారు. ఎవరు కట్టడాలు కట్టినా..అధికారుల ద్వారా గజానికి 75 రూపాయాల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నుంచే ఈ తంతు జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో భారీ ఎత్తున ఆ పార్టీ హై కమాండ్ కు దశలవారీగా ముడుపులు అందుతున్నాయన్నారు. అయితే ఆర్ టాక్సీ అరాచకాలు మరువకముందే..ఇప్పుడు కొత్తగా యూట్యాక్స్ పేరుతో రైస్ మిల్లుల రూపంలో కోట్ల స్కాం జరగడం ఆ పార్టీ పాలనకు నిదర్శనమన్నారు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి.

బిజెపి శాసనసభ పక్ష నేత హోదాలో ఏలేటి కామెంట్స్ ను మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాము ఎప్పుడు అలాంటి స్కాంల జోలికే వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి విషయాలను తమ పార్టీ హై కమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు. అయితే ఉత్తం వివరణ ఎలా ఉన్నా.. మొన్న ఆర్ టాక్స్ పేరుతో… రేవంత్ పై విమర్శలు గుప్పించిన ఏలేటి.. ఆ తర్వాత సచివాలయం వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తంపై కూడా ఏలేటి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉత్తంకుమార్ రెడ్డి పై చేసిన విమర్శలు కట్టుబడి ఉంటారా..? లేక ఆర్ టాక్స్ లాగే యూ టాక్స్ వ్యవహారాన్ని వదిలేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి.