Umar Nazir Mir: రోహిత్ శర్మ అవుట్ చేయడం ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఉమర్ నజీర్ మీర్ సంచలనంగా మారిపోయాడు. గురువారం అనేక సామాజిక మాధ్యమాల వేదికలో ఉమర్ నజీర్ మీర్ పేరు చక్కర్లు కొట్టింది..ఉమర్ నజీర్ మీర్ సొంత రాష్ట్రం జమ్ము కాశ్మీర్. ఇతడు ఆరు అడుగుల 4 అంగుళాలు ఉంటాడు. ఫేస్ బౌలింగ్ వేస్తాడు. అద్భుతమైన బంతులు వేస్తూ స్టార్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. రోహిత్ శర్మకు, అజింక్య రహానేకు నరకాన్ని లైవ్ లో చూపించాడు.. దీంతో అతడి పేరు మార్మోగిపోతోంది.
రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లలో భాగంగా ముంబై, జమ్ము కాశ్మీర్ జట్లు గురువారం తలపడ్డాయి. ముంబై జట్టు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది..ఉమర్ నజీర్ మీర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 31 సంవత్సరాల ఈ పేస్ బౌలర్ బౌన్స్ తో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.. షార్ట్ పిచ్ బంతితో రోహిత్ శర్మను మూడు పరుగులకే అవుట్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ ఫామ్ లో ఉన్న అజంక్య రహనే ను క్లీన్ బౌల్డ్ చేశాడు. శివం దుబేను తొలి బంతికే పెవీలియన్ పంపించాడు. డొమెస్టిక్ క్రికెట్లో రహానే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ముంబై జట్టుకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు. అయినప్పటికీ ఉమర్ నజీర్ మీర్ ముందు అతడి అప్పుడు ఉడకలేదు
ఉమర్ నజీర్ మీర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం.. మిగతా బౌలర్లు కూడా సత్తా చాటడంతో ముంబై జట్టు 33.2 ఓవర్లలోనే 120 పరుగులకు కుప్పకూలింది.. ఇక ఈ మ్యాచ్లో ఉమర్ నజీర్ మీర్ 11 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. 41 పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాకుండా యశస్వి జైస్వాల్ (4), శ్రేయస్ అయ్యర్ (11) దారుణంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ (51) మాత్రమే ఆకట్టుకున్నాడు..
ఉమర్ నజీర్ మీర్ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడు ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉంటాడు. చక్కటి పేస్ వేస్తాడు. బౌన్స్ కూడా అదే స్థాయిలో సంధిస్తాడు. అతడి ఎత్తు బాగా కలిసి వస్తోంది. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ మొదలు పెట్టాడు. ఇప్పటివరకు 57 మ్యాచులు ఆడాడు. 138 వికెట్లు సొంతం చేసుకున్నాడు. లిస్టు ఏ క్రికెట్లో 54 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక టి20 లలో 32 వికెట్లు పడగొట్టాడు. 2018 – 19 దేవేందర్ ట్రోఫీలో ఇండియా- సీ జట్టులో ఆడాడు.