Sai Pallavi: సాయి పల్లవి హీరోయిన్స్ లో ఓ అరుదైన రకం. పాతకాలపు పద్ధతులు పాటించే ఈ తరం అమ్మాయి. వాస్తవం మాట్లాడాలంటే సాయి పల్లవి గొప్ప అందగత్తె కాదు. చూడటానికి పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. కేవలం టాలెంట్ ని నమ్ముకొని హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో సాయి పల్లవి నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్. ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా… ఆ సినిమా విజయంలో క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కాలి. ఆ సినిమాలో ఆమె పాత్ర అంత బలంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన పాత్రను సాయి పల్లవి తన నటనతో మరింత ఆకర్షణీయంగా మలిచారు.
ఇక సాయి పల్లవి నటించిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్. నాగ చైతన్యతో చేసిన లవ్ స్టోరీ 2021 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇటీవల క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ సైతం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా… నటిగా తనని తాను నిరూపించుకుంటున్న, స్టార్ హీరోలు ఆమె వైపు కన్నెత్తి చూడటం లేదు.
Also Read: రేషన్ కార్డును పోగొట్టుకున్నారా.. డూప్లికేట్ కార్డును ఏ విధంగా పొందాలంటే?
ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, పవన్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ సాయి పల్లవిని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం లేదు. గ్లామర్ పరంగా సాయి పల్లవి మైనస్ కావచ్చు. కానీ కమర్షియల్ హీరోయిన్ కి కావలసిన లక్షణాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. మంచి డాన్సర్, యాక్టర్. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రనైనా రక్తి కట్టించే సత్తా ఆమెలో ఉంది.
కానీ ఆమెకు స్టార్ హీరోతో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. స్టార్ హీరోలు ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వకపోగా కెరీర్ కి చరమగీతం పాడే ప్రయత్నం చేస్తున్నారు. వరుస విజయాలతో ఫార్మ్ లో ఉన్న ఆమెను చెల్లి పాత్రలు చేయాలంటూ ఇబ్బంది పడుతున్నారు. ఆ మధ్య చిరంజీవి చెల్లిగా చేయాలంటూ ఓ ఆఫర్ ఆమె వద్దకు వెళ్ళింది. ఆ ఆఫర్ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించారు.
తాజాగా మహేష్ పక్కన చెల్లిగా చేయాలంటూ మేకర్స్ ఆమెను కలిశారని కథనాలు వెలువడుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మహేష్ చెల్లెలు పాత్ర చేయాలని సాయి పల్లవిని అడుగుతున్నారట. ఈ ఆఫర్ సాయి పల్లవి అంగీకరించారా? రిజెక్ట్ చేశారా? అనేది ఇంకా తెలియదు. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ కావాలని సాయి పల్లవి తపిస్తుంటే.. స్టార్ హీరోలు ఆమెను చెల్లిగా మార్చేయాలని చూస్తున్నారు.
Also Read: కరోనాను కట్టడి చేసే మొక్క ఇదే.. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందంటే?