Hair : అతివలకు జుట్టు అంటే చాలా ఇష్టం. కాస్త జుట్టు తెల్లగా అవుతున్నా.. ఊడిపోతున్నా కూడా చాలా బాధ పడుతుంటారు. శిరోజాల గురించి చాలా శ్రద్ధ చూపిస్తారు మహిళలు. వీటి కోసం ఎన్నో షాంపూలు, కండీషనర్ లు, ఆయిల్స్ వంటివి చేంజ్ చేస్తూ కూడా ఉంటారు. మరి మీ శిరోజాలు పొడుగ్గా పెరగాలి అంటే ఏం చేయాలో ఓ సారి చూసేయండి..
మీకు పొడవైన జుట్టు కావాలి అంటే బయోటిన్ ఫుడ్స్ ను తీసుకోవాల్సిందే. కోడిగుడ్లను బయోటిన్ పవర్ హౌజ్ అంటారు. ఇందులో ఉండే పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. సో మీ జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. సాల్మోన్, మాకరెన్, సార్డైన్ వంటి కొవ్వు చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు బయోటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది కాబట్టి వీటిని కూడా రెగ్యూలర్ గా తీసుకోండి. మీ జుట్టు బలంగా తయారు అవుతుంది.
అవకాడో పండ్లలో బయోటిన్ లెవల్స్ ఎక్కువ ఉంటాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలి అంటే అవకాడోనో డైట్ లో చేర్చుకోవాల్సిందే. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవడం ఉత్తమం. చిలగడదుంపలో విటమిన్ ఎ తో పాటు బయోటిన్ కూడా ఉంటుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో బయోటిన్ కూడా లభిస్తుంది. అందుకే పాలకూరను డైట్ లో చేర్చుకుంటే కురుల అందం మీ సొంతం అవుతుంది. ఓట్స్, బార్లీ, క్వినోవా వంటి తృణధాన్యాల్లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కూడా జుట్టు ఆరోగ్యం సొంతం అవుతుంది. పాలు, యోగర్డ్, ఛీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో బయోటిన్ ఉంటుంది. వీటిని రెగ్యూలర్ గా తినడం వల్ల జుట్టు పెరుగుతుంది.