Heroes Remuneration : ఈ మధ్య కాలంలో రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిన యంగ్ హీరోలు వీళ్లే…

కాబట్టి తన రెమ్యూనరేషన్ కూడా 15 నుంచి 20 కోట్ల వరకు పెంచేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక్క సినిమా కోసం 15 నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడట...

Written By: NARESH, Updated On : May 20, 2024 10:06 pm

These are the young heroes who increased the remuneration ration

Follow us on

Heroes Remuneration : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరూ కూడా వరుసగా మంచి సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు స్టార్ హీరోలతో సైతం పోటీపడే రేంజ్ కి ఎదిగిపోయారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలను ఓడించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధించింది. ఇక అందులో భాగంగానే ఆయన ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు తేజ సజ్జ, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలందరూ కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు మంచి విజయాలు అందుకొని ఉన్నారు. కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాల కోసం భారీ రేంజ్ లో పారితోషికం తీసుకోబోతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక తెలుగు లో టిల్లు స్క్వేర్ సినిమాకి ముందు సిద్దు ఒక సినిమాకి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకం గా 15 నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక తేజ సజ్జ ‘హనుమాన్ ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి ఈయన కూడా ఒక్క సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన ఒక సినిమాకి 25 నుంచి 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తేజ సజ్జా చేతిలో దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి…

ఇక ఇదిలా ఉంటే ‘గామీ ‘ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేసి మంచి విజయాన్ని సాధించి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి తన రెమ్యూనరేషన్ కూడా 15 నుంచి 20 కోట్ల వరకు పెంచేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక్క సినిమా కోసం 15 నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడట…