నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది. బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఇక దర్శకుడు ఓం రావత్ మరో అప్డేట్ ఇచ్చాడు. సినిమా అసలు పని ఇప్పుడే మొదలైందట. ఆది పురుష్ ఆరంభం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే విడుదల చేస్తారట.
Also Read: టీజర్ తో ఆకట్టుకుంటున్న ”సుల్తాన్” !
కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్.
ఈ పాన్ ఇండియా సినిమాలో సీత లాంటి పాత్ర చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఇక కృతి సనోన్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
Also Read: క్రేజీ కలయిక నుండి ఇంట్రస్టింగ్ పోస్టర్ !
కాగా త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా పూర్తిగా ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు ప్రభాస్.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.