టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కొంత మంది వ్యక్తులు కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరుతుండగా పట్టాభి నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాభికి కూడా గాయాలయ్యాయి. సుమారు పది మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 2:04 pm
Follow us on


టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కొంత మంది వ్యక్తులు కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరుతుండగా పట్టాభి నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాభికి కూడా గాయాలయ్యాయి. సుమారు పది మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Also Read: ఇలా అయితే ఆ పథకం లక్ష్యం దెబ్బతిన్నట్లే..: జగన్‌ సారూ స్పందించండి మీరు

కార్యాలయానికి బయలుదేరే సమయంలో ఇంటి దగ్గర్లోనే కాపుకాసి కొందరు తనపై దాడి చేశారని, తన కారు పూర్తిగా ధ్వంసమైందని, డ్రైవర్‌‌పై కూడా దాడికి పాల్పడ్డారని గాయాలపాలైన పట్టాభి తెలిపారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని పేర్కొన్న పట్టాభి తనపై జరిగిన దాడి వైసీపీ చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని, వాస్తవాలు బయటపెట్టడానికి ఎప్పుడూ వెనకడుగు వేయనని పట్టాభి స్పష్టం చేశారు.

Also Read: బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్
‌‌

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కుంభకోణాలు బయట పెట్టినందుకే తనను టార్గెట్‌ చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. పది రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్న పట్టాభి, మీడియా ముఖంగా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లానని, అయినప్పటికీ తనకు రక్షణ కల్పించ లేదని పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. మారణాయుధాలతో దాడి జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్న పట్టాభి పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం పట్టభి వాహనంపై దుండగులు దాడి చేశారు. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలే చేశాడు.