Corona vs Normal Fever: గత 15 రోజుల నుంచి వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి. సాయంత్రం, ఉదయం వేళల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. దాంతో ఎన్విరాన్ మెంటల్ చేంజెస్ జరిగిపోయాయి. ఆ చల్లటి గాలులు ఉదయం పూట ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చర్మం పొడి బారడంతో పాటు ఇతర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వస్తున్నది. ఈ లక్షణాలు కొవిడ్ లక్షణాలే కావడంతో చాలా మంది తెగ భయపడిపోతున్నారు. కాగా, ఈ సమస్యలను ఎలా పరిశీలించాలో ఆరోగ్య నిపుణులు ఇలా వివరిస్తున్నారు.
దేశంలో కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్, డెల్ట్రాకన్ వేరియంట్స్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో జనం ఇంకా భయపడిపోతున్నారు. ప్రతీ పది మందిలో దాదాపుగా నలుగురు లేదా ఐదుగురు దగ్గు, జలుబు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు. కాగా, వారికి ఉన్న లక్షణాల ద్వారా అది సాధారణ జ్వరమా ..? లేదా కొవిడా అనేది ఎలా గుర్తించాలంటే..
Also Read: Corona: కరోనా విలయం.. దేశంలో థర్డ్ వేవ్ తప్పదా? ఏపీ, తెలంగాణను వణికిస్తున్న మహమ్మారి
సాధారణ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్స్ కొవిడ్ లక్షణాలు ఒకేలా ఉండటం వలన కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే, వీటిలో తేడా ఉంది. జ్వరం లేకుండా కేవలం గొంతు నొప్పి, తుమ్ములు, జలుబు ఉంటే కనుక అది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అని భావించాల్సి ఉంటుంది. అయితే, అదే పూర్తి వాస్తవమని చెప్పలేం. కొందరిలో దగ్గు, గొంతు నొప్పి ఉంటే వారికి కొవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది.
కాబట్టి టెస్టు చేయించుకుని కొవిడ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. జ్వరం లేకుండా దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలున్న ఉన్నా కరోనా టెస్టు చేయించుకోవాలి. అలా చేయించుకున్న తర్వాతనే అది కొవిడా?..లేదా సాధారణ వైరల్ ఫీవర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే డెల్టా వేరియంట్ కొవిడ్ లక్షణాలలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుంటాయి. దాంతో పాటు వాసన, రుచి కోల్పోతుంటారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వీటి మధ్య తేడాలను గుర్తించాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
Also Read: కరోనాకు సాధారణ జ్వరానికి తేడాలు ఇవే.. ఏ విధంగా గుర్తించాలంటే?