Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ ప్రస్తుతం హిందీ సినిమాల పై మోజు పెంచుకుంది. అందుకే, బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోకస్ తో పాటు ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం లేకుండా రెచ్చిపోతుంది. తెలుగులో సినిమాల్లో స్కట్ వేయడానికి ఇష్టపడని ఈ బ్యూటీ హిందీలో మాత్రం అడగకుండానే రెచ్చిపోతుంది. రష్మిక.. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే అక్కడ ఆమె డ్రెస్సింగ్ చూసి అంతా ఆశ్చర్య పోయారు.

టీ-షర్ట్, షార్ట్ ధరించి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది రష్మిక. దీంతో ఆమె ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు రష్మిక డ్రెస్సింగ్‌పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దుస్తులు వేసుకోవడం పూర్తిగా మర్చిపోయావా ఏంటి ? ఇది మరీ ఓవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినా రష్మిక మాత్రం తన డ్రెస్సింగ్ తన ఇష్టం అంటుంది. ఇక రష్మిక చేస్తున్న హిందీ సినిమాలో క్రేజీ మూవీ ‘గుడ్ బై’.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేనా?

ఈ చిత్రంలో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ రష్మిక ఈ సినిమాలో అమితాబ్ కి కూతురిగా నటిస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. కాగా ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని రష్మిక, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అన్నట్టు ఇది రష్మికకు బాలీవుడ్ లో రెండో మూవీ. మొదటి సినిమా ‘మిషన్ మజ్ను’. ఈ సినిమా కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
[…] Bhimla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. […]