LIC Credit Card: ప్రముఖ బీమా రంగ సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ పాలసీదారుల కోసం క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ ద్వారా ఎల్ఐసీ ఈ పాలసీలను అందిస్తుండటం గమనార్హం.
ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజులు, యాన్యువల్ ఫీజులు చెల్లించకుండానే ఎల్ఐసీ పాలసీదారులు ఈ క్రెడిట్ కార్డులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ కార్డును తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఎల్ఐసీ ద్వారా తీసుకునే లూమిన్ క్రెడిట్ కార్డుకు పరిమితి 50 వేల రూపాయలుగా ఉండగా ఎక్లాట్ క్రెడిట్ కార్డుకు పరిమితి 2 లక్షల రూపాయలుగా ఉంది.
Also Read: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
https://www.liccards.in/bank/idbi-bank-2?card_type=1 లింక్ ద్వారా ఈ క్రెడిట్ కార్డుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డును తీసుకున్న వాళ్లకు అస్యూర్డ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా లభించనుంది. ఈ కార్డుపై 100 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసిన వాళ్లు డిలైట్ పాయింట్లను సైతం పొందే అవకాశం ఉంటుంది.
ఈ క్రెడిట్ కార్డును వినియోగించి 400 రూపాయల కంటే ఎక్కువ మొత్తం లావాదేవీ చేసిన వాళ్లు ఒక శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ను పొందవచ్చు. 3000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని సులభతరమైన ఈఎమ్ఐలకు కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: కేంద్రం సూపర్ స్కీమ్.. ఇలా చేస్తే కూతురి పెళ్లికి రూ.71 లక్షలు!