https://oktelugu.com/

Delhi Weather: ఢిల్లీలో ఒకలా.. తమిళనాడులో మరోలా.. వాతావరణంలో ఈ భారీ మార్పులకు కారణం ఇదే..

రాగల ఐదు రోజుల్లో భారత వాతావరణంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఢిల్లీ వాసులు అతలాకుతలం అవుతుండగా.. ఇప్పుడు తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Written By:
  • Mahi
  • , Updated On : November 26, 2024 / 11:33 AM IST

    Delhi Weather

    Follow us on

    Delhi Weather: కొన్ని రోజులుగా దేశంలోని వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఒక చోట భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో చోట కాలి కాలుష్యంతో రాజధాని అతలాకుతలం అవుతుంది. తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబర్ 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నవంబర్ 29 నుంచి 30 వరకు కేరళ, మహా, నవంబర్ 26 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఐఎండీ తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 28-29 న నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 28, 30 తేదీల్లో ఉదయం పంజాబ్, హర్యానా, చండీగడ్ లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 26 నుంచి 30 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో తెల్లవారు జామున దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

    హిందూ మహాసముద్రం 5.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.3 డిగ్రీల తూర్పు రేఖాంశం, ట్రింకోమలీకి ఆగ్నేయంగా 600 కిలో మీటర్లు, నాగపట్నంకు ఆగ్నేయంగా 880 కిలో మీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలో మీటర్ల దూరంలో రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు కదులుతుంది.

    సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. నవంబర్ 29 నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని తాజా పాశ్చాత్య అలజడి ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది.

    ఉష్ణోగ్రత పరిస్థితులు మరియు అంచనా
    రానున్న 5 రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు యథాతథంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్ తప్ప వాయువ్య భారత దేశంలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల కనిష్ఠ సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. రాగల 4 రోజుల పాటు మహారాష్ట్రలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

    మత్స్యకారుల హెచ్చరిక
    దేశంలోని వివిధ ప్రాంతాల్లో తుఫాను వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మత్స్యకారులు కొన్ని ప్రాంతాలకు వెళ్లద్దని ఇప్పటికే వెళ్లిన వారు తిరిగి రావాలని సూచించారు.
    * నవంబర్ 25న ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు ఈక్వెటోరియల్ హిందూ మహాసముద్రం.
    * నవంబర్ 29 వరకు శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతం.
    * నవంబర్ 26 నుంచి 29 వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి
    * నవంబర్ 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడి బంగాళాఖాతం వెంబడి వెళ్లద్దని ఐఎండీ హెచ్చరించింది.

    ఢిల్లీకి ఐఎండీ వాతావరణ సూచన
    గత 24 గంటల్లో ఢిల్లీ/ఎన్సీఆర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగాయి. నవంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు జాతీయ రాజధాని ప్రాంతంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది.

    ఏక్యూఐ: ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం (నవంబర్ 25) ఉదయానికి మెరుగుపడినా.. మధ్యాహ్నానికి బాగా బాగా క్షీణించింది. ఢిల్లీలో 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సోమవారం ఉదయం 9 గంటలకు 285 ఉండగా, సాయంత్రం 4 గంటలకు అది 349, రాత్రి 10 గంటలకు 391కి పడిపోయింది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో మొత్తం ఏక్యూఐ 395గా ఉంది.

    ఉదయం 6 గంటల సమయానికి ఢిల్లీలోని ఆర్కేపురంలో ఏక్యూఐ 232, పంజాబీ బాగ్లో ఏక్యూఐ 273గా నమోదైంది.