https://oktelugu.com/

YS Jagan : గెలిస్తే మేము.. గెలవకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్.. లాజిక్ మిస్ అవుతున్న జగన్!

దేశంలో ఓడిపోయిన పార్టీ తెరపైకి తెస్తున్న అంశం ఈవీఎంల ట్యాంపరింగ్. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రతిపక్షాలు సైతం ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చాయి. అదే సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 26, 2024 / 11:36 AM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan :  ఏపీలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించింది వైసిపి. వై నాట్ 175 అన్న నినాదంతో ఈ ఎన్నికల బరిలో దిగింది. కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దారుణ పరాజయం ఎదురు కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయింది. ఈవీఎంల టెంపరింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేతలు అనుమానించారు. దానిని కూటమి నేతలు తిప్పికొట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించడం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? అని ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే గెలిచే పార్టీలు హాయిగా ఉన్నాయి. ఓడే పార్టీలు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఇదే అంశాన్ని బయటపెట్టింది. ఇప్పుడు వైసీపీ ఓటమితో జగన్ సైతం అదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన బిజెపి కూటమికి బంపర్ విజయం దక్కింది. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకుకనీస స్థాయిలో సీట్లు వచ్చాయి.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితిలో ఉండడంతో ఉద్ధవ్ శివసేన కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఈవీఎంల టెంపరింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయంపై స్పందించారు ఏపీ మాజీ సీఎం జగన్.

    * ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి
    జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జగన్. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొచ్చారు. చెప్పుకోవడానికి పెద్ద ప్రజాస్వామ్యమైనా.. విజయవంతమైన ప్రజాస్వామ్యంగా ఉండాలంటే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని ఆకాంక్షించారు జగన్. ప్రపంచంలో చాలా దేశాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మనదేశంలో కూడా అలానే జరిగితే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు జగన్. ఓటమి తర్వాత కూడా జగన్ ఇదే విషయంపై మాట్లాడారు. ఎక్కడో లోపం జరిగిందంటూ ఈవీఎంల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహా ప్రకటన రావడం విశేషం.

    * బిజెపి వరుస విజయాలపై అనుమానం
    మనదేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు రావడం ఇదే తొలిసారి కాదు. బిజెపి వరుస విజయాలపై అనేక రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో బిజెపికి భారీ ఓటములు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటే పశ్చిమబెంగాల్లో బిజెపి గెలిచి ఉండొచ్చు కదా? కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కదా? తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చి ఉండేది కదా? మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ కు ఎన్నికలు జరిగితే.. ఝార్ఖండ్లో ఎందుకు బిజెపి ఓడిపోయింది? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయి. మెజారిటీ ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ నడుస్తోంది. అదే స్థాయిలో భారత దేశంలో కూడా బ్యాలెట్ కొనసాగాలని మెజారిటీ పార్టీలు కోరుతున్నాయి. అయితే గెలిస్తే తమదని.. ఓడిపోతే ఈవీఎంల టెంపరింగ్ గాని జగన్ లాంటి వ్యక్తులు ప్రస్తావించడం మాత్రం అంత క్షేమం కాదు.