https://oktelugu.com/

Rajamouli: ఆర్ఆర్ఆర్ పై ఢిల్లీ ఎఫెక్ట్.. అయినా రిలీజ్ ఖాయం.. కారణం అదే!

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఒకవైపు సినిమా విడుదలవుతుందని ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసినప్పటికీ మరొకవైపు ఒమిక్రాన్ భయం పట్టుకుంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగటంతో ఏ ప్రభుత్వాలు ఎటువంటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 29, 2021 / 04:54 PM IST
    Follow us on

    Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఒకవైపు సినిమా విడుదలవుతుందని ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసినప్పటికీ మరొకవైపు ఒమిక్రాన్ భయం పట్టుకుంది.

    రోజురోజుకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగటంతో ఏ ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో అని ఒకవైపు రాజమౌళి టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై దేశ రాజధాని ఢిల్లీ గట్టి దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ మొత్తం ఎల్లో అలర్ట్ విధించారు. దీంతో థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇలా ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని టెన్షన్ పడుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం మరొకవైపు తగ్గేదే లే అంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

    ఇప్పటికే రాజమౌళి చిత్ర బృందంతో కలసి దేశంలోని వివిధ నగరాల్లో పెద్దఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఒకవైపు ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని పెద్దఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఏమాత్రం వాటి గురించి పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో లీనమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయాలని రాజమౌళి గట్టి పట్టు పట్టారు. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి గెలుస్తారా లేదా ఒమిక్రాన్ వల్ల సినిమా వాయిదా పడుతుందా వేచిచూడాలి.