Jagga Reddy: జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం స్పందిస్తుందా?

Jagga Reddy: తెలంగాణలో ప్రస్తుతం త్రికోణ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికి నిలుపుకోవాలని చూస్తున్నాయి. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ చెప్పుకున్నా ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అయిపోయింది. అందుకే టీఆర్ఎస్ బీజేపీ మధ్యే విమర్శలు పెరిగాయి. ఢిల్లీ కేంద్రంగా కూడా బీజేపీని ఎండగట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్ గురించి ప్రజలు పార్టీలు మరిచిపోయాయి. ఈ […]

Written By: Srinivas, Updated On : December 29, 2021 5:21 pm
Follow us on

Jagga Reddy: తెలంగాణలో ప్రస్తుతం త్రికోణ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికి నిలుపుకోవాలని చూస్తున్నాయి. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ చెప్పుకున్నా ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అయిపోయింది. అందుకే టీఆర్ఎస్ బీజేపీ మధ్యే విమర్శలు పెరిగాయి. ఢిల్లీ కేంద్రంగా కూడా బీజేపీని ఎండగట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్ గురించి ప్రజలు పార్టీలు మరిచిపోయాయి.

Jagga Reddy

ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో టీఆర్ఎస్ కు కూడా ఏం పాలుపోవడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అధికారం నుంచి దూరం చేస్తుందేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. దీంతో తమ ఉనికి కాపాడుకునే క్రమంలో టీఆర్ఎస్ ఇప్పటి నుంచే బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలును తెరమీదకు తీసుకొచ్చి బీజేపీని దెబ్బతీయాలని భావిస్తోంది.

Also Read: బీజేపీ చీప్ లిక్కర్ ఆఫర్.. కేటీఆర్ సంధించిన సెటైర్

ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమైన ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని భావించారు. దీంతో ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో మరో సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేంద్రానికి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. సొంత పార్టీ వారే అడ్డంకులు సృష్టిస్తుండటంతో ఏం చేయాలో రేవంత్ రెడ్డికి పాలుపోవడం లేదు. జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో తెలియడం లేదు. ఒకవేళ రేవంత్ కు వార్నింగ్ ఇస్తే జగ్గారెడ్డికి సపోర్టు చేసినట్లు కాగా ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి వార్నింగ్ ఇవ్వకపోతే జగ్గారెడ్డిని పట్టించుకోనట్లు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ముమ్మాటికి బీజేపీ అని తేలిపోయింది. మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికలతో పాటు నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న బీజేపీ ప్రస్తుతం టీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ బీజేపీని అణగదొక్కాలని భావిస్తూ దాన్ని ఆదిలోనే అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Also Read: కాంగ్రెస్ కు నేతలే శాపమా?

Tags