https://oktelugu.com/

Chandrababu Secret Tour: చంద్రబాబు రహస్య టూర్.. ఆ దేశానికి ఫ్యామిలీతో.. ఏంటీ కథ..?

Chandrababu Secret Tour: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విహార యాత్రకు వెళ్లారు. అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రయాణమయ్యారు. ఒక్క టీడీపీ కార్యాలయానికి పది రోజులు అందుబాటులో ఉండనని చెబుతూ సమాచారం ఇచ్చారు. దీంతో చంద్రబాబు పర్యటనపై అనుమానాలు వస్తున్నాయి. అసలు రహస్యంగా వెళ్లడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్ పర్యటనపై ఎందుకు సీక్రెట్ గా ఉంచారో తెలియడం లేదు. జనవరి 2 వరకు అక్కడే గడుపుతారని టీడీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2021 / 04:53 PM IST
    Follow us on

    Chandrababu Secret Tour: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విహార యాత్రకు వెళ్లారు. అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రయాణమయ్యారు. ఒక్క టీడీపీ కార్యాలయానికి పది రోజులు అందుబాటులో ఉండనని చెబుతూ సమాచారం ఇచ్చారు. దీంతో చంద్రబాబు పర్యటనపై అనుమానాలు వస్తున్నాయి. అసలు రహస్యంగా వెళ్లడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్ పర్యటనపై ఎందుకు సీక్రెట్ గా ఉంచారో తెలియడం లేదు.

    Chandrababu Secret Tour

    జనవరి 2 వరకు అక్కడే గడుపుతారని టీడీపీ వర్గా ల ద్వారా తెలిసింది. ఇంతకీ ఎవరికి తెలియకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడంతో చంద్రబాబు రహస్యంగా ఉంచుకున్నారనే ప్రచారం సాగుతోంది.

    Also Read: బ్యాడ్ ఇయర్ టు చంద్రబాబు..!

    చంద్రబాబు నాయుడు అన్నింటికి రహస్యం పాటించే ఆయన విదేశీ పర్యటనలపై ఎప్పుడు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఆయన ఈ పర్యటన కూడా ఎవరికి చెప్పకుండా చేయడం వెను క ఆంతర్యం ఇదేనని తెలుస్తోంది. మొత్తానికి వ్యక్తిగత పర్యటన అయినా కుటుంబ పర్యటన అయినా చంద్రబాబు స్టైలే వేరని తెలుస్తోంది.

    చంద్రబాబు పర్యటన జనవరి 2 వరకు ఉండటంతో థాయిలాండ్ అందాలను తనివితీరా ఆస్వాదిస్తారని తెలుస్తోంది. కోటరీకి తెలియకుండా పది రోజుల పాటు విహార యాత్రకు వెళ్లడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు రహస్యంగా పర్యటనలు చేయాల్సిన అవసరం ఏముందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయినా బాబు పర్యటనపై ఎందుకింత రహస్యమనే సంశయాలు అందరిలో నెలకొంది.

    Also Read: బీజేపీతో పొత్తుపై టీడీపీ ఆశలు వదులుకుందా?

    Tags