https://oktelugu.com/

Akkineni Akhil’s wedding : అక్కినేని అభిమానులకు పండుగలాంటి వార్త..అఖిల్ పెళ్లి తేదీ ఖరారు..ఎక్కడ ఈ పెళ్లి జరిపించబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వీళ్లిద్దరి పెళ్లి జరిగే వారం రోజులు ముందు అఖిల్, జునైబ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతుంది అని నాగార్జున సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేశాడు. ఈ పెళ్లి ఇప్పుడు మార్చి 23 వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు కుటుంబ సభ్యులు.

Written By:
  • Vicky
  • , Updated On : January 21, 2025 / 04:18 PM IST
    Akhil -Zainab Wedding Update

    Akhil -Zainab Wedding Update

    Follow us on

    Akkineni Akhil’s wedding : అక్కినేని అభిమానులకు శుభ వార్త. త్వరలోనే అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. గత నెల నాల్గవ తేదీన అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాధారణంగా ఈ వివాహాన్ని జరిపించారు. అక్కినేని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు, ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ కి బాగా సన్నిహితంగా ఉండే ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీళ్లిద్దరి పెళ్లి జరిగే వారం రోజులు ముందు అఖిల్, జునైబ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతుంది అని నాగార్జున సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేశాడు. ఈ పెళ్లి ఇప్పుడు మార్చి 23 వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు కుటుంబ సభ్యులు.

    అక్కినేని అఖిల్ కి గతం లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య , సమంత నిశ్చితార్థం జరిగిన కొత్తల్లోనే వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరకపోవడం తో పెళ్లి పీటలు వరకు ఈ సంబంధం వెళ్ళలేదు. ఆ తర్వాత అఖిల్ ఎక్కువగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడు. గత రెండు మూడేళ్ళ నుండి జునైబ్ తో ప్రేమాయణం నడుపుతున్న ఈయన, పెద్దల అంగీకారం తో ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వివాహ మహోత్సవాన్ని కూడా నాగ చైతన్య పెళ్లి లాగానే చాలా సాధారణంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీడియా కి ప్రవేశం లేదట. ఇప్పటికే తన సన్నిహితులందరికీ నాగార్జున శుభలేఖలు కూడా పంచేసినట్టు తెలుస్తుంది. ఈ జంట కి సోషల్ మీడియా లో అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈయనకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేకపోవడం గమనార్హం. మధ్యలో రెండు మూడు యావరేజ్ సినిమాలు వచ్చాయి. మంచి టాలెంట్ ఉన్న అఖిల్ కి సరైన సినిమా పడడం లేదని అభిమానుల అభిప్రాయం. ఎన్నో ఆశల మధ్య విడుదలైన ఏజెంట్ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కనీసం ఓటీటీ లో కూడా ఈ సినిమాని విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అఖిల్ భారీ బడ్జెట్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్న హీరోలకు ఈమధ్య బాగా కలిసి వస్తుంది. అలా అఖిల్ కి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.