
ఎడతెరిపి లేని వర్షంతో హైదరాబాద్‌లో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లో ప్రమాదవశాత్తూ ఇంటి గోడ కూలి చిన్నారి మృతి చెందింది. సంజయ్‌నగర్‌లోని జయకృష్ణ అనే వ్యక్తి వర్షాల కారణంగా పాత ఇల్లును రెండు రోజుల క్రితం కూల్చివేశారు. అయితే వర్షం కారణంగా పూర్తిగా కూల్చలేదు. సోమవారం అక్కడన్ను ఇటుకలు తీస్తుండగా గోడకూలింది. అక్కడే ఉన్న చిన్నారి జయశ్రీపై మట్టిపెల్లలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే మరో వృద్ధురాలికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విద్యానగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల కిందట పాతబస్తీలో ఇల్లుకూలి ఇద్దరు మృతి చెందారు. దీంతో అధికారులు పాత ఇళ్లు వెంటనే కూల్చివేయాలని ఆదేశిస్తున్నారు.