Varanasi glimpse failure: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ కి సంబంధించిన గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులకు, నవంబర్ నెల మొదలు అవ్వగానే నాన్ స్టాప్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముందుగా పృథ్వీ రాజ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు, ఆ తర్వాత ఈ సినిమా నుండి ‘సంచారి’ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ రెండిటి తర్వాత ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. చివర్లో రామోజీ ఫిలిం సిటీ లో #Globetrotter ఈవెంట్ ని ఏర్పాటు చేసి అక్కడ గ్రాండ్ గా వారణాసి టైటిల్ ని రివీల్ చేసి గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ వీడియో పూర్తిగా AI తో చేసినట్టుగా అనిపించింది. కేవలం సినిమా కాన్సెప్ట్ ని తెలిపేందుకు మాత్రమే ఈ వీడియో ని తయారు తీశారు. అందులో రాజమౌళి విజన్ కనిపించింది. ఆ విజన్ కి తగ్గట్టు సినిమాని తీస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు అయిపోతాయి. ఇదంతా పక్కన పెడితే గ్లింప్స్ వీడియో ని సోషల్ మీడియా లో సరైన ప్లానింగ్ తో విడుదల చేయడం లో మూవీ టీం విఫలం అయ్యింది. ఏ సమయం లో విడుదల చేస్తారు అనేది చెప్పలేదు. ఒక పక్క ఈవెంట్ జరుగుతూ ఉంది, ఇంతలోపే ఇక్కడ సోషల్ మీడియా లో గ్లింప్స్ వీడియో విడుదలైంది. ఫలితంగా ఈ వీడియో టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేయడం లో విఫలం అయ్యింది. ఆల్ టైం రికార్డ్స్ సంగతి పక్కన పెడితే కనీసం ఈ గ్లింప్స్ వీడియో నాని ప్యారడైజ్ రికార్డు ని కూడా అందుకోలేకపోయింది.
వివరాల్లోకి వెళ్తే ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వీడియో కి 24 గంటల్లో 11 మిలియన్ కి పైగా వ్యూస్, 3 లక్షల 50 వేల లైక్స్ వచ్చాయి, కానీ ‘వారణాసి’ చిత్రానికి తొలి 24 గంటల్లో 7.2 మిలియన్ వ్యూస్ మరియు 3 లక్షల 20 వేల లైక్స్ మాత్రమే వచ్చాయి. వ్యూస్ సంగతి పక్కన పెడితే లైక్స్ అయినా భారీగా రావాలి. కానీ అది కూడా వారణాసి కి జరగలేదు. దీన్ని బట్టీ చూస్తే ఈ గ్లింప్స్ వీడియో ఆడియన్స్ కి అంతగా నచ్చలేదా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్డేట్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. త్వరలోనే తమిళ సీనియర్ హీరోలలో ఒకరైన రంగనాథన్ మాధవన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.