Bigg Boss Telugu 8: మణికంఠ వెన్నుపోటు కి ఆదిత్య ఓం బలి..సలహాలు చెప్పినందుకు ఎవరైనా నామినేట్ చేస్తారా!

మొదటి వారం విష్ణు ప్రియ విషయం లో అదే చేస్తాడు. దీనికి విష్ణు ప్రియ ఎంత బాదపడిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత యష్మీ తో కూడా ఇలాగే క్లోజ్ గా ఉంటూ, ఆమెలోని నెగటివ్ పాయింట్స్ ని బయటకి తీసి నామినేషన్స్ లో వేసాడు.

Written By: Vicky, Updated On : September 24, 2024 8:55 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. ఈ మూడు వారాల్లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అర్థం అయ్యారు కానీ మణికంఠ మాత్రం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం కాలేదు, అదే విధంగా ఈ షో ని చూస్తున్న ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదు. కేవలం సానుభూతి యాంగిల్ లో అతనికి ఓట్లు పడుతున్నాయే కానీ, గేమ్ ని చూసి మాత్రం కాదు అనేది వాస్తవం. కానీ గత వారం లో ఆయన ఫిజికల్ గా వీక్ గా ఉన్నప్పటికీ కూడా గేమ్స్ ఆడేందుకు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించాడు. అందుకు ఆయన్ని మెచ్చుకోవచ్చు. గత వారం ఆయన గ్రాఫ్ అలా ఆడడం వల్ల బాగా పెరిగింది. అయితే మణికంఠ కి హౌస్ లో ఒక చెడ్డపేరు ఉంది. ఎవరితో అయితే ఆయన క్లోజ్ గా తిరుగుతాడో, వాళ్లలో ఉన్న నెగటివ్ పాయింట్స్ ని వెతికి వాటినే నామినేషన్ పాయింట్స్ లో పెడుతాడు.

మొదటి వారం విష్ణు ప్రియ విషయం లో అదే చేస్తాడు. దీనికి విష్ణు ప్రియ ఎంత బాదపడిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత యష్మీ తో కూడా ఇలాగే క్లోజ్ గా ఉంటూ, ఆమెలోని నెగటివ్ పాయింట్స్ ని బయటకి తీసి నామినేషన్స్ లో వేసాడు. దీనికి బాగా ఫీల్ అయిన యష్మీ స్నేహం పేరు తో నన్ను మోసం చేసి ఈరోజు దొంగ దెబ్బ తీసావు, ఇది నేను మర్చిపోను, ఈ హౌస్ కి నువ్వు చాలా డేంజర్, ఎన్ని రోజులైతే నేను ఈ హౌస్ లో ఉంటానో, అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది. చెప్పినట్టుగానే ఈరోజు ఆమె మణికంఠ ని నామినేట్ చేసింది. విష్ణు ప్రియ, యష్మీ విషయం లో మణికంఠ ఏదైతే చేసాడో, నేడు ఆదిత్య ఓం విషయంలో కూడా నామినేషన్స్ లో అదే చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘మీరు నాకు ప్రతీ విషయం లో ముందుగానే సలహాలు ఇస్తున్నారు. దానివల్ల నేను ప్రభావితమై ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తున్నాను. ఇది నా గేమ్ మీద ప్రభావం పడుతుంది, మీరు నాకు ఒక తండ్రి లాగ చెప్తున్నారు, కానీ మీకు తెలియకుండా బొమ్మరిల్లు ఫాదర్ రేంజ్ లో నాకు చెప్తున్నారు. సలహాలు ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది. కానీ మీవి ఓవర్ అయిపోతున్నాయి’ అని అంటాడు. దీనికి ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘నేను ఈ పాయింట్ పై ఎక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు, ఇక మీదట నేను నీకు ఎలాంటి సలహాలు ఇవ్వను’ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మణికంఠ కి నిజంగా అలా అనిపిస్తే ఆదిత్య ఓం సలహాలు ఇచ్చినప్పుడే చెప్పుంటే బాగుండేది, కాని అప్పుడు సైలెంట్ గా ఉంటూ, నామినేషన్స్ సమయంలో పాయింట్ గా చెప్పడం ఏంటో అంటూ మణికంఠ పై సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ పడుతున్నాయి.