https://oktelugu.com/

Bigg Boss Telugu 8: డేంజర్ జోన్ లోకి వచ్చిన ఆడపులి..బిగ్ బాస్ టీం సహకరించకపోతే ఈ వారం అవుట్!

నిఖిల్, పృథ్వీ గేమ్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం నాశనం చేయాలని అనుకోవడం, హౌస్ లో కంటెస్టెంట్స్ పై ఆమె నోరు జారీ విధానం, ఇవన్నీ చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 / 09:05 AM IST

    Bigg Boss Telugu 8 (1)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ వారం లాగానే ఈ వారం లో కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది. గడిచిన మూడు వారాల్లో బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ బయటకి వెళ్లిపోయారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రేరణ, నబీల్, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం మరియు పృథ్వీ రాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో టాస్కులు ఆడడం లో కానీ, నామినేషన్స్ సమయంలో బలంగా తన గొంతు పైకి లేపి మాట్లాడడం లో కానీ, హౌస్ లో అందరికంటే వీక్ ఆదిత్య ఓం అని చెప్పొచ్చు. ఆయన వయస్సు 48 ఏళ్ళు అవ్వడం వల్ల, ఆయన తనకు ఎంత సాధ్యం అవుతుందో అంత వరకు బలంగా ఆడుతున్నాడు. కానీ పెర్ఫార్మన్స్ పరంగా చూస్తే హౌస్ లో అందరికంటే వీక్, ఆ కోణం లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడడం ఒక్కటే కాదు, ప్రేక్షకులు క్యారక్టర్ ని కూడా చూస్తారు.

    ఆ కోణం లో చూస్తే ఆదిత్య ఓం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ది బెస్ట్ అనొచ్చు. గత వారం లో కానీ, నిన్న జరిగిన నామినేషన్స్ లో కానీ, ఆదిత్య ఓం ని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా అవమానించారు, కానీ ఆయన ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా నోరు జారకుండా ఉన్న విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే గడిచిన మూడు వారాల కంటే ఈ వారం ఆదిత్య ఓం గ్రాఫ్ ఓటింగ్ లో బాగా పెరిగింది. ఆయన ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్స్ 100 శాతం లేదు. అలాగే నబీల్ కి ఇంతటి ఫాలోయింగ్ ఉందని ఆయన నామినేషన్స్ లోకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు, ఆ తర్వాతి స్థానం లో ప్రేరణ కొనసాగుతుంది. ఇక అందరికంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా నే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈమెకు పడిన ఓట్లు పావు శాతం కూడా లేదు.

    నిఖిల్, పృథ్వీ గేమ్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం నాశనం చేయాలని అనుకోవడం, హౌస్ లో కంటెస్టెంట్స్ పై ఆమె నోరు జారీ విధానం, ఇవన్నీ చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగించింది. గత సీజన్ లో శోభా శెట్టి కి చాలా తలపొగరని అనుకున్నారు, సోనియా ని చూస్తే ఆమెకి పది రెట్లు ఎక్కువ తల పొగరు ఉన్న అమ్మాయిగా ఆడియన్స్ కి అనిపించింది. అందుకే అంత తక్కువ ఓటింగ్ పడుతుంది, మ్యానేజ్మెంట్ కోటాలో ఆమెని బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగా రక్షిస్తే సేవ్ అవ్వాల్సిందే కానీ, ఆమెని ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరని ఓటింగ్ చూస్తుంటే అర్థం అవుతుంది.