https://oktelugu.com/

Bigg Boss Telugu 8: 10వ వారంలో నామినేషన్స్ లోకి వచ్చిన 7 మంది కంటెస్టెంట్స్..డేంజర్ జోన్ లో ఏకంగా ముగ్గురు!

ఈసారి హౌస్ మేట్స్ నామినేషన్ పాయింట్స్ కోసం ఇంతకు ముందులాగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నిన్న మధ్యాహ్నం నుండి ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. హౌస్ మేట్స్ అందరూ తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరి కంటెస్టెంట్స్ ని పిలిచి మడ్ టబ్ లో నిల్చోబెట్టాలి. అప్పుడు పైన నుండి బురద నీళ్లు సదరు కంటెస్టెంట్స్ మీద పడుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 08:27 AM IST

    Bigg Boss Telugu 8(199)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన ఎపిసోడ్ లో నయనీ పావని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇది అందరూ ఊహించిన ఎలిమినేషన్ కాబట్టి, ఆడియన్స్ నుండి పెద్దగా షాకింగ్ రియాక్షన్ లేదు. అయితే నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న ఈ సీజన్ అప్పుడే 9 వారాలు పూర్తి చేసుకొని 10వ వారంలోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్ అందరికీ కావాల్సినన్ని నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గత వారం జరిగిన గొడవలు అలాంటివి. అదే విధంగా వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున మరికొన్ని పాయింట్స్ ని హౌస్ మేట్స్ కి అందించాడు. కాబట్టి ఈసారి హౌస్ మేట్స్ నామినేషన్ పాయింట్స్ కోసం ఇంతకు ముందులాగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నిన్న మధ్యాహ్నం నుండి ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. హౌస్ మేట్స్ అందరూ తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరి కంటెస్టెంట్స్ ని పిలిచి మడ్ టబ్ లో నిల్చోబెట్టాలి. అప్పుడు పైన నుండి బురద నీళ్లు సదరు కంటెస్టెంట్స్ మీద పడుతుంది.

    ఈ నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి హరితేజ, యష్మీ , నిఖిల్, ప్రేరణ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో ఈరోజు ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల వేస్తారు. ఈ ప్రోమో లో హరితేజ, ప్రేరణ ని నామినేట్ చేయడం మనం చూసాము. ఎంత మంచి గేమర్ అయినా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాది అని పెద్దలు అంటారు అని ప్రేరణ గత వారం లో నోరు జారిన సందర్భాలను గుర్తు చేస్తూ నామినేట్ చేస్తుంది. వీళ్లిద్దరి మధ్య పోరాటం ఇప్పట్లో ఆగదు అని ఈ ఎపిసోడ్ తో అందరికీ అర్థం అయిపోతుంది. అదే విధంగా గత రెండు మూడు వారాల నుండి గౌతమ్, నిఖిల్ మధ్య క్లాష్ ఒక రేంజ్ లో నడుస్తుంది. ఈ నామినేషన్ ఎపిసోడ్ లో ఇద్దరు బయటకి వెళ్లి కొట్టుకునేందుకు సిద్ధమైపోయారు. మరి చివరికి ఏమి జరగబోతుందో నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి.

    ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఈ 7 మంది హౌస్ మేట్స్ లో కచ్చితంగా నిఖిల్, గౌతమ్, ప్రేరణ టాప్ 3 లో ఉంటారు. ఇక మిగిలిన వారిలో విష్ణు ప్రియ కి టాప్ 4 స్థానం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. 5వ స్థానం కోసం పృథ్వీ, యష్మీ మధ్య హోరా హోరీ పోటీ ఉండొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగే పొలింగ్స్ అన్నిట్లో కూడా వీళ్లిద్దరికీ సరిసమానమైన ఓటింగ్ వస్తుండడం మనమంతా గమనించే ఉంటాము. ఇక చివరి స్థానం లో హరితేజ ఉంటుంది. ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు వచ్చే వారం 99 శాతం ఉంటుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఈమెతో పాటుగా యష్మీ లేదా పృథ్వీ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి.