https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు నుంచి ఈ రెండు రాశుల వారి జీవితాల్లో డబ్బే డబ్బు..

కుటంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇప్పటి వరకు ఏవైనావాగ్వాదాలు ఉంటే అవి నేటితో సమసిపోతాయి. పిల్లల విషయంలో కొంత నిరాశకు గురవుతారు. బ్యాంకు రుణాలు ఉంటే వెంటనే పూర్తి చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు వస్తాయి. సోమవారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ కారణంగా మిథునం, కన్య రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇప్పటి వరకు ఏవైనావాగ్వాదాలు ఉంటే అవి నేటితో సమసిపోతాయి. పిల్లల విషయంలో కొంత నిరాశకు గురవుతారు. బ్యాంకు రుణాలు ఉంటే వెంటనే పూర్తి చేస్తారు.

    వృషభ రాశి:
    రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల సమయం. ఈ రాశి వారికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. సాయంత్రం జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.

    మిథున రాశి:
    వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. క్రీడల్లో పాల్గొనే వారు విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

    సింహారాశి:
    ఇంట్లో ఇప్పలి వరకు ఉన్న ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లబిస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    కన్య రాశి:
    ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు.

    తుల రాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    ఈ రాశి వారిప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడుతారు. ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి శుభవార్త వింటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

    ధనస్సు రాశి:
    ఈ రాశి వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

    మకర రాశి:
    ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కొత్త కోర్సులో చేరాలనుకుంటే ఇతరుల సలహా తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులు వెంటనే పూర్తి చేయాలి.

    కుంభరాశి:
    వ్యాపారుల కొత్త వ్యక్తులను కలుస్తారు. తెలియని వివాదాల్లో తలదూర్చొద్దు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉల్లాసమైన జీవితం కోసం ప్లాన్ చేస్తారు.

    మీనరాశి:
    ఆర్థిక లావాదేవీలు నిర్వహించేరవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత నిరాశతో ఉంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వీటిని వాయిదా వేసుకోవడం మంచిది.