
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భనవ నిర్మాణం కోసం ఈనెల 10వ తేదీన భూమిపూజ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సుమారు 22 నెలల పాటు పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరగనున్నాయి. దీని కోసం అక్కడ సౌండ్ ప్రూఫ్ వాల్‌ను నిర్మించనున్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్లీ మహాత్ముడి విగ్రహాన్ని కీలకమైన ప్రదేశంలో ప్రతిష్టించనున్నారు.