
8న రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌కు వామపక్షాలు శనివారం మద్దతు ప్రకటించాయి. సీపీఐ(ఎం), సీపీఐ(ఎం-ఎల్), రెవెల్యుషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ సంయుక్త ప్రకటనలో తెలిపింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం, ఆహార భద్రతను కాపాడేందుకు అన్నదాతల పోరాటానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు-2020ను రద్దు చేయాలని ఆయా పార్టీలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే జాతీయ రహదారులను దిగ్బంధించడంతో పాటు టోల్‌ప్లాజాల్లో టోల్ వసూలు చేయకుండా చూస్తామన్నారు.