Roasted Peas: కాల్చిన శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Roasted Peas: మన ఆరోగ్యానికి శనగలు ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు శనగలలో పుష్కలంగా ఉంటాయి. శనగలను రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పచ్చి శనగలు తినడం ద్వారా ఏ స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో కాల్చిన శనగలు తినడం ద్వారా కూడా అదే స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉండె […]

Written By: Navya, Updated On : November 25, 2021 12:43 pm
Follow us on

Roasted Peas: మన ఆరోగ్యానికి శనగలు ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు శనగలలో పుష్కలంగా ఉంటాయి. శనగలను రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పచ్చి శనగలు తినడం ద్వారా ఏ స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో కాల్చిన శనగలు తినడం ద్వారా కూడా అదే స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి.

Roasted Peas

ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉండె శనగలను తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు జరుగుతుంది. కాల్చిన శనగలను తినడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. శనగలలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తేమ, లుబ్రికెంట్స్, ఫైబర్స్, కాల్షియం, ఐరన్, విటమిన్స్ కూడా ఉంటాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కాల్చిన శనగలు తోడ్పడతాయి.

Also Read: ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని తీసుకుంటున్నారా.. ప్రమాదమేనంటున్న వైద్యులు?

మధుమేహంతో బాధపడేవాళ్లు కాల్చిన శనగలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కాల్చిన శనగలలో ఉంచే పీచు పదార్థం గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. కాల్చిన శనగలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సులభంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అలసట, నీరసంతో బాధ పడే పురుషులు కాల్చిన శనగలు తీసుకుంటే ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

బెల్లంతో కలిపి కాల్చిన శనగలను తినడం ద్వారా రక్తహీనత సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. పాలతో కాల్చిన శనగలను తీసుకోవడం ద్వారా బలహీనతకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

Also Read: మిగిలిపోయిన ఆహారాన్ని తింటున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?