https://oktelugu.com/

మా ఆయనకు అది ఇష్టం లేదు… కోరిక చంపుకోలేక!

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి పరిశ్రమకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నిహారిక. నాగబాబు గారాల తనయ నిహారిక స్టార్ అయిపోదామనే కలలతో హీరోయిన్ గా మారారు. మెగా ఫ్యామిలీ నుండి కొండంత అండ ఉండగా, మనకు తిరుగేముందిలే అనుకున్నారు. అయితే ఎంత సపోర్ట్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ నిహారిక వైపు కన్నెత్తి చూడలేదు. మెగా హీరోలు సక్సెస్ అయినట్లుగా నిహారిక సక్సెస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 25, 2021 / 10:16 AM IST
    Follow us on

    Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి పరిశ్రమకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నిహారిక. నాగబాబు గారాల తనయ నిహారిక స్టార్ అయిపోదామనే కలలతో హీరోయిన్ గా మారారు. మెగా ఫ్యామిలీ నుండి కొండంత అండ ఉండగా, మనకు తిరుగేముందిలే అనుకున్నారు. అయితే ఎంత సపోర్ట్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ నిహారిక వైపు కన్నెత్తి చూడలేదు. మెగా హీరోలు సక్సెస్ అయినట్లుగా నిహారిక సక్సెస్ కాలేకపోయింది. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా ప్లాప్స్ అందుకున్నాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి నిహారిక హీరోయిన్ కావడం ఇష్టం లేకపోవడం కూడా, ఆమె ఫెయిల్యూర్ కి ఒక కారణం.

    నిహారిక హీరోయిన్ కావడం మెగా డై హార్డ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఆ కుటుంబం అంటే అమితమైన గౌరవం కలిగి ఉన్నవారు, ఆ ఇంటి అమ్మాయి హీరోయిన్ కావడాన్ని అవమానంగా ఫీల్ అయ్యారు. అందుకే నిహారిక హీరోయిన్ గా చేయడానికి, వీలులేదని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిహారిక కుటుంబానికి కూడా ఆమె హీరోయిన్ కావడం నచ్చలేదు. అయితే పట్టుబట్టి ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఒక మనసు మూవీతో ఆమె అరంగేట్రం చేశారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత చేసిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వరుసగా ప్లాప్ అయ్యాయి.

    కుటుంబ సభ్యులు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయిన నిహారిక పెళ్లి చేసుకోక తప్పలేదు. గత ఏడాది డిసెంబర్ లో నిహారిక వివాహం వెంకట చైతన్యతో జరిగింది. వీలైతే పెళ్లి తర్వాత కూడా నిహారిక నటించాలని అనుకున్నారు. అయితే భర్త వెంకట చైతన్యకు ఆమె నటించడం ఇష్టం లేదట. ఈ విషయాన్ని నిహారిక తాజాగా వెల్లడించారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నేను నటించడం వెంకట చైతన్యకు ఇష్టం లేదని ఓపెన్ గా చెప్పింది. అందుకే సినిమా పిచ్చి వదులుకోలేక, నిర్మాతగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

    Also Read: వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ.. మీరు చూశారా?

    నిహారిక తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. గతంలో నిహారిక మ్యాడ్ హౌస్, ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ వంటి సిరీస్ లు తెరకెక్కించారు.

    Also Read: Malayalam Beauties: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

    Tags