Star Hero In Mahesh Babu Movie: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు,అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ తో చెయ్యబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

అదేమిటి అంటే కథ రీత్యా ఈ సినిమాలో ఒక్క పవర్ ఫుల్ క్యారక్టర్ ఉంటుంది అట..ఆ క్యారెక్టర్ ని ఒక్క యువ హీరో చేసేంత స్కోప్ ఉంది అని త్రివిక్రమ్ భావించి ఆ పాత్ర కోసం న్యాచురల్ స్టార్ నాని ని ఇటీవలే సంప్రదించారు అట..కానీ నాని ఎందుకో ఈ పాత్ర చెయ్యడానికి అగీకరించలేదు..

Also Read: Bollywood Top Directors For NTR: ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ వీళ్ళే..!
దీనితో ఈ పాత్ర కోసం మరో యువ హీరో శర్వానంద్ తో సంప్రదింపులు జరుపుతున్నారు అట..ఆయన ఇందులో నటించడానికి ఓకే చెప్తాడో లేదో చూడాలి..ఒక్కవేళ శర్వానంద్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించకపోతే తమిళ్ యువ హీరోలను సంప్రదించడానికి చూస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిందే..

ఈమెతో పాటు సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది..అతి త్వరలోనే షూటింగ్ ప్రారంబించుకోబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ఎన్నో ప్రత్యేకతలతో మరియు ప్రధాన తారాగణం తో తెరకెక్కబోయ్యే ఈ సినిమా కి సంబందించి మరిన్ని సమాచారాలు ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బయటకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Hari Hara Veera Mallu: ఆగిపోయిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా.. ఆందోళనలో ఫాన్స్