Homeఎంటర్టైన్మెంట్Jr NTR Acting: విలక్షణ నటనకు విశ్వరూపం జూ. ఎన్టీఆర్

Jr NTR Acting: విలక్షణ నటనకు విశ్వరూపం జూ. ఎన్టీఆర్

Jr NTR Acting: విలక్షణ నటనలో ఎన్టీఆర్ కి నేటి కాలంలో ఇంకెవరూ సాటి లేరు. ఎన్టీఆర్ ఒక సమ్మోహన సంచలనాల సమాహారం, వినూత్న భావాల విశేషణం, ఎన్టీఆర్ విలక్షణ నటనా వినోదానికి చిరునామా. ఎన్నాళ్లైనా ఎన్నేళ్ళైనా ఎన్టీఆర్ ఎప్పటికీ నిత్యనూతన అధ్యయనమే. అందుకే, ఎన్టీఆర్ నేటి మహా నటుడు. మహా నటులు కనుమరుగైపోయిన ఈ తరంలో.. వెండితెర నటన వైభవానికి దిక్సూచిలా తారక్ తెలుగు తెర పై అడుగు పెట్టాడు.

Jr NTR Acting
Jr NTR

నాలుగు పేజీలు డైలాగ్ లు చెప్పినా ఒప్పించలేని ఎన్నో క్లిష్టమైన ఎమోషన్స్ ను, ఎన్టీఆర్ కేవలం తన కను పాపలతోనే ఆ ఎమోషన్స్ ను పలికించగలడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఒకే తరహాలో ఒప్పించగలడు. తన నటనతో నాట్యంతో జలధరించే విన్యాసాలు చేయగల సకల కళా వల్లభుడు జూ.ఎన్టీఆర్.

Also Read: Hari Hara Veera Mallu: ఆగిపోయిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా.. ఆందోళనలో ఫాన్స్

అంత గొప్ప నటుడు ఇన్నేళ్లు ఎక్కువగా ఒక ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్‌ హీరోగానే మిగిలిపోవడం ఆశ్చర్యకరం. మన దర్శక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఎక్కువ మాస్ హీరోగానే చూశారు. తారక్ స్టార్ డమ్ కి తగ్గట్టు ఉర మాస్ చిత్రాలే తీశారు. నటుడిగా, నృత్య దార్శినికుడిగా, గాయకుడిగా, తెలుగులోనే కాదు యావత్ భారతదేశం అంతా జేజేలు పలుకే స్థాయి జూ.ఎన్టీఆర్.

అందుకే అభిమానులకే కాదు, సినీ ప్రముఖులకు కూడా ఎన్టీఆర్ ఫేవరేట్ హీరో అయ్యాడు. ఏ పాత్ర చేసినా అందులో పాలలోని నీళ్లలా కలిసిపోవడం ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇంత విద్వత్తు ఉండి కూడా.. రొటీన్ యాక్షన్ సినిమాల వైపు తారక్ ఇన్నాళ్లు టైమ్ పాస్ చేయడం దురదృష్టకరం. ఇప్పటికైనా స్టార్ డమ్ అనే చట్రం నుంచి ఎన్టీఆర్ బయటకు వచ్చి.. విలక్షణ పాత్రలను, వైవిధ్యమైన కథల్ని భుజానికెత్తుకోవాలి.

Jr NTR Acting
NTR

అలా విలక్షణమైన రీతిలో ఎన్టీఆర్, తనలోని నటుడిని తెరమీద సాక్షాత్క రింపచేస్తే.. అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచ సినీ తెర పై ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆర్ఆర్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే కాదు, పరభాషా ప్రేక్షకుల్నీ అలరించడం కూడా ఎన్టీఆర్ కు పరిపాటి అని రుజువు అయ్యింది. కాబట్టి.. ఎన్టీఆర్ ప్రపంచ సినిమాని ఏలడానికి సమయం ఆసన్నమైంది. సన్నద్ధం అవ్వు.

Also Read: Bollywood Top Directors For NTR: ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ వీళ్ళే..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular