Bollywood Top Directors For NTR: నేటి జనరేషన్ హీరోలలో మాస్ అనే పేరు ఎత్తితే మనకి వెంటనే మైండ్ లో తట్టే పేరు జూనియర్ ఎన్టీఆర్..నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఆది మరియు సింహాద్రి వంటి సెన్సషనల్ హిట్స్ తో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు..

NTR
నిన్న మొన్నటి వరుకు కేవలం తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం అయినా జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు #RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తన అద్భుతమైన నటన తో బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ లోని ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాడు ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్..

Tarak
Also Read: Garuda Vega Producer: జీవిత రాజశేఖర్ మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు.. నిర్మాత సంచలన ఆరోపణలు
ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక్క సినిమా, అలాగే KGF సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యగా వాటికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక ఈ సినిమా లతో పాటు ఎన్టీఆర్ కి బాలీవుడ్ నుండి అగ్ర దర్శకులు సినిమాలు చెయ్యడానికి ఎంతో ఉత్సహం చూపిస్తున్నారు అట..

Jr Ntr
ఇటీవలే ఆయన బాలీవుడ్ టాప్ 2 డైరెక్టర్స్ లో ఒక్కరు అయినా సంజయ్ లీల బన్సాలి తో ఒక్క సినిమా చెయ్యడానికి చర్చలు కూడా జరిపినట్టు సమాచారం..దీనితో పాటుగా కరణ్ జోహార్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ లను హీరోలుగా పెట్టి ఒక్క మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యడానికి కూడా ప్లాన్ చేస్తునట్టు సమాచారం..వీటితో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ బడా డైరెక్టర్లు ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యడానికి చర్చలు జరిపారు..ఎన్టీఆర్ అన్నట్టుగా తన కెరీర్ #RRR కి ముందు #RRR కి తర్వాత లా ఉండబోతుంది అనేదానికి సంకేతాలు ఆయన లైనప్ చూస్తూ ఉంటె అర్థం అయ్యిపోతుంది..ఎన్టీఆర్ భవిష్యత్తుయిలో చెయ్యబొయ్యే సినిమాలు అన్ని ఘనవిజయాలు సాధించాలి అని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
Also Read: Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?