Kalpika Ganesh Viral Video: నెల రోజుల క్రితం ప్రముఖ నటి కల్పిక(Kalpika Ganesh) ఒక రెస్టారంట్ ఓనర్ తో నడిరోడ్డులో గొడవ పడుతూ పెద్ద ఎత్తున హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరోసారి ఆమె ఒక రెస్టారంట్ స్టాఫ్ తో దురుసుగా మాట్లాడుతూ, అసభ్యమైన పదజాలం ఉపయోగిస్తూ హల్చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. వీడియో బాగా వైరల్ అవ్వడంతో అసలు ఎందుకు రిసార్ట్ స్టాఫ్ తో గొడవ పడాల్సి వచ్చిందో ఒక ప్రత్యేకమైన వీడియో చేసి అభిమానులతో చెప్పుకొచ్చింది. ఈ వీడియో లో ఆమె అప్పుడే నిద్రలేచి బెడ్ మీద పడుకొని, ఒక రకమైన యాటిట్యూడ్ తో చెప్పినట్టు అనిపించింది. ఆ వీడియో ని మీరు కూడా ఆ ఆర్టికల్ చివర్లో చూడవచ్చు.
Also Read: ఒక చిన్న లవ్ స్టోరీ కి 300 కోట్ల కలెక్షన్స్.. అసలు ఇందులో ఏముంది…
ఆమె మాట్లాడుతూ ‘బ్రౌన్ టౌన్ రిసార్ట్ కి నిన్న నేను వెళ్లడం జరిగింది. అక్కడ బాగా చలి ఉండడం తో నాకు సిగరెట్లు కావాలని రిసార్ట్ యాజమాన్యం ని అడిగాను. అందుకు వాళ్ళు మా దగ్గర అలాంటివి అందుబాటులో లేవని చెప్పారు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లిన తర్వాత వైఫై పాస్ వర్డ్ మరియు తాళాలు ఇచ్చారు. సిగరెట్లు ఇక్కడ లేవు అనేసరికి క్యాబ్ బుక్ చేసుకొని బయటకి వెళ్లి తాగుదామని అనుకున్నాను. కానీ ఫోన్ లో సిగ్నల్స్ లేవు, రిసార్ట్ లో వైఫై సరిగా పని చేయడం లేదు. అప్పుడు నేను యాజమాన్యం వద్దకు వెళ్లి వైఫై పని చేయడం లేదు, నాకు క్యాబ్ బుక్ చేయండి అని అడిగితే, అలాంటివి మేము చెయ్యము అంటూ చాలా దురుసుగా ప్రవర్తించారు. నేను ఎంతో నిదానంగా వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా మ్యానేజర్ రెచ్చిపోవడం తో నేను గొడవకు దిగాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కథేంటో తెలిసిపోయిందిగా…
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా కల్పిక మాట్లాడిన ఈ మాటలే కనిపిస్తున్నాయి. ఈమె పూర్తి పేరు కల్పిక గణేష్. 2009 వ సంవత్సరం లో విడుదలైన ‘ప్రయాణం’ చిత్రం తో సినీ జీవిత ప్రయాణం మొదలైంది. హీరోయిన్ రేంజ్ అందం ఉన్నప్పటికీ, ఈమెకు ఎందుకో హీరోయిన్ అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. కేవలం క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి మాత్రమే పరిమితం చేశారు. రీసెంట్ గా ఈమె ఈమధ్య కాలం లో ఈమె ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదు. ఈమె చివరిసారిగా నటించిన చిత్రం ‘ఆతర్వా’. 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ తమిళ సినిమా తర్వాత మళ్ళీ మరో చిత్రం లో కనిపించలేదు కల్పిక. రాబోయే రోజుల్లో ఈమెకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు
బ్రౌన్ టౌన్ రిసార్ట్ వివాదంపై స్పందించిన నటి కల్పిక
రిసార్టులో సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే నాతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడు
ఎంత నిదానంగా చెప్పినా… https://t.co/JxoCp9PSO2 pic.twitter.com/72LGDySZ3g
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025