MEGA157 Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన లేని కీర్తి ప్రతిష్టలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు.చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్ లు కూడా దక్కాయి. ఇక మిగతా సినిమాలన్నీ కూడా ప్లాపులుగా మిగిలాయి. ఇక ఇప్పటికి ఆయన భారీ సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఖ్యాతిని పెంచిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా మొదటి వరుసలో ఉంటాడు. మరి అలాంటి చిరంజీవి నుంచి వచ్చిన సినిమా ప్రేక్షకులో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది ఇప్పుడు చర్చనూయంశంగా మారుతోంది. ఇక ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…వింటేజ్ చిరంజీవిని మరోసారి మన ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అంటూ ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించి తన నటన ప్రతిభతో ప్రశంసలను అందుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా అలాంటి తరహాలోనే తెరకెక్కబోతుందట. మరి ఇలాంటి పాత్రలను చేయడంలో చిరంజీవిది అందవేసిన చేయి…
Also Read: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్టర్ ..రామ్ చరణ్ ను ఏదో చేసేలానే ఉన్నాడే..!
కాబట్టి ఈ సినిమాలో రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర 15 నిమిషాల పాటు ఈ సినిమాలో ఉండబోతుందట. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి చేసిన ఈ సినిమా తనకు గొప్ప గుర్తింపును తీసుకొస్తుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా, నయన తార భర్తగా కనిపించబోతున్నాడట. ఈ రెండు పాత్రల్లోని వేరియేషన్స్ చూపిస్తూ ఆయన బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తోంది.
Also Read: అవతార్ ట్రైలర్ రివ్యూ: ఈసారి మంట పెట్టే లాగానే ఉన్నాడే!
నయనతారకి విపరీతమైన కోపం అయితే ఉంటుందట. మరి తన భార్యను తను ఎలా మార్చుకున్నాడు అనేది ఒక స్టోరీ అయితే, పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ స్టర్స్ ను ఎలా పట్టుకున్నాడు అనేది ఇంకొక కథగా తెలుస్తోంది. ఈ రెండు కథలను కలిపి ఈ సినిమాలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది…