https://oktelugu.com/

Adbutham Movie: నన్ను నేను తెరపై చూసుకోవడానికి ఎంతో కష్టపడ్డా అంటున్న… శివానీ రాజశేఖర్

Adbutham Movie: తెలుగు ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ జీవిత ఈ దంపతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే ఏదైనా ముక్కు సూటిగా ప్రశ్నించ గలిగే హీరోగా రాజశేఖర్.సినిమా తారలు తమ పిల్లలకు ఇచ్చే సంపద వారసత్వం సినిమాలే అనే చెప్పుకోవాలి. శివాత్మిక “దొరసాని” చిత్రంతో తమ రెండో కుమార్తె శివాని ఇటీవల విడుదలైన “అద్భుతం” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు ఈ దంపతులు. ఇటీవలే ఓటీటీ వేదికగా డిస్నీ+ హాట్ స్టార్ లో […]

Written By: , Updated On : November 23, 2021 / 05:32 PM IST
Follow us on

Adbutham Movie: తెలుగు ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ జీవిత ఈ దంపతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే ఏదైనా ముక్కు సూటిగా ప్రశ్నించ గలిగే హీరోగా రాజశేఖర్.సినిమా తారలు తమ పిల్లలకు ఇచ్చే సంపద వారసత్వం సినిమాలే అనే చెప్పుకోవాలి. శివాత్మిక “దొరసాని” చిత్రంతో తమ రెండో కుమార్తె శివాని ఇటీవల విడుదలైన “అద్భుతం” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు ఈ దంపతులు. ఇటీవలే ఓటీటీ వేదికగా డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన “అద్భుత” సినిమా ప్రేక్షకుల్లో మంచి విజయం సాధిస్తుంది.తేజ సజ్జా, శివానీ జంటగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అద్భుతం”.

actress shivani rajashekar interesting comments about her movie

ఈ సినిమా సక్సెస్‌మీట్‌ ను ఇటీవల ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ… శివానీ, శివాత్మిక అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచీ వాళ్లు ఏది అడిగినా కాదనలేదు సినిమాల్లోకి వెళ్తామన్నా సంతోషంగా ఒప్పుకున్నా అన్నారు. ఇప్పుడు శివానీ తండ్రిగా నన్ను గర్వపడేలా చేసింది అని హర్షం వ్యక్తం చేశారు. ‘అద్భుతం’తో శివానీ నటిగా పరిచయం అయ్యింది ఈ సినిమా చూసి చాలామంది నాకు ఫోన్లు చేసి శివానీని పొగుడుతూ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. 2014 నుంచి నన్ను నేను తెరపై చూసుకోవాలని ఏదో ఓ ప్రయత్నం చేస్తూనే ఉన్నా అలా “అద్భుతం” తో నా కల సాకారం అయ్యింది అని శివాని తెలిపింది. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కడం ఆనందంగా ఉందని చెబుతుంది ఈ భామ. ప్రస్తుతం ఓటిటీ లో దూసుకుపోతుంది ఈ చిత్రం.