CM KCR: వరి ఎఫెక్ట్: ఢిల్లీలో కేసీఆర్ కు షాకుల మీద షాకులు

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ముదిరాయి. అవి తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారంపై చర్చించాలని భావించినా కేసీఆర్ ఆశలు తీరడం లేదు. ఫలితంగా కేసీఆర్ కు నిరాశ తప్పడం లేదు. దీంతో కేసీఆర్ కు ఎదురుచూపులే మిగులుతున్నాయి. వరి ధాన్యం […]

Written By: Srinivas, Updated On : November 23, 2021 5:40 pm
Follow us on

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ముదిరాయి. అవి తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారంపై చర్చించాలని భావించినా కేసీఆర్ ఆశలు తీరడం లేదు. ఫలితంగా కేసీఆర్ కు నిరాశ తప్పడం లేదు. దీంతో కేసీఆర్ కు ఎదురుచూపులే మిగులుతున్నాయి.

వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వ్యవహారాలు ప్రధాన సమస్యలను ప్రధానితో చర్చించి పరిష్కరించుకోవాలని తలచినా అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఢిల్లీ వెళ్లినా ఏ ఒక్క మంత్రి కూడా కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇక ప్రధాని, హోంమంత్రి అవకాశం కల్పిస్తారనుకోవడం భ్రమే అవుతోంది. కేంద్రంతో అమీతుమీ తేల్చుకుందామని వెళ్లిన కేసీఆర్ కు వారు అవకాశం మాత్రం ఇవ్వడం లేదు.

ఇటీవల బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడంతో వారు ఇలా చేస్తున్నారనే వాదన కూడా వస్తోంది. కానీ కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే ఇన్ని బాధలు వచ్చేవి కాదని చెబుతున్నారు. ఇక్కడ నోటికొచ్చినట్లు తిట్టి అక్కడికెళ్లి అవకాశం ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మరిన్ని ప్రయోజనాలు దక్కేవి కదా అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేయడంతో ఆయనకు తగిన శాస్తి జరుగుతోందని తెలుస్తోంది.

Also Read: Kavitha: కవిత కోసం ఎమ్మెల్సీ పదవి సిద్ధమేనా?

ఈ నేపథ్యంలో కేసీఆర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైనా సరైన హామీలు రాలేదు. దీంతో ఆయన వెళ్లిన పని అసంపూర్తిగా ఉండటంతో అసలు ఫలితం దక్కడం లేదు. మంత్రులను కలవాలని అనుకున్న అది నెరవేరడం లేదు. ఎవరు కూడా సమయం ఇవ్వడం లేదు. దీంతో కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టమే అనిపిస్తోంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలుంటేనే పనులు జరుగుతాయనే సత్యం ఎరగరా అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Jagan Sarkar: కోర్టులతోనూ గేమ్స్.. జగన్ సర్కారా? మజాకా?

Tags