HomeజాతీయంVodafone Idea follows Airtel: ఫోన్ పట్టుకుంటే షాక్ యే ఇక.. ఎయిర్ టెల్ బాటలోనే...

Vodafone Idea follows Airtel: ఫోన్ పట్టుకుంటే షాక్ యే ఇక.. ఎయిర్ టెల్ బాటలోనే వోడాఫోన్, ఐడియా రేట్లు భగ్గు

Vodafone Idea follows Airtel: భారతీయ టెలికాం కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. ఫోన్ పట్టుకుంటే షాక్ తగిలేలా చేస్తున్నాయి. దీంతో కస్టమర్లపై అదనపు భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో భయాందోళన చెందుతున్న వారిపై కంపెనీలు శిరోభారం పెంచుతున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ టారిఫ్ లు పెంచగా తాజాగా వొడాఫోన్, ఐడియా సైతం తమ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Vodafone Idea follows Airtel
కాల్, డేటా పథకాలపై టారిఫ్ లను 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. పెంచిన రేట్లు నవంబర్ 25 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది దీంతో వినియోగదారులకు వణుకు మొదలైంది. ప్రారంభ ప్లాన్ ల ధరలు 25 శాతం పెంచుతున్నాయి. దీంతో కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పెరుగుతున్న ధరలో వినియోగదారులకు కష్టాలే మిగలనున్నాయి. కంపెనీలు ఇస్టారాజ్యంగా ధరలు పెంచుతూ పోతుంటే సామాన్యుడి సంగతి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినియోగదారుల సగటు ఆదాయంపై పెను భారం పడనుందని తెలుస్తోంది.

Also Read: Washing Machine Tips: వాషింగ్ మెషీన్ లో వేసిన బట్టలు తళతళా మెరవాలంటే పాటించాల్సిన చిట్కాలివే?

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్లు వాడాలా లేదా అనే వాదనలు సైతం వినియోగదారుల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుతూ పోతుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పెంచిన రేట్లు తగ్గించి వినియోగదారుల బాధలు గుర్తించాలని డిమాండ్లు సైతం వస్తున్నాయి. దీనిపై అవి ఏమేరకు స్పందిస్తాయో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: Tenant Rights: అద్దెకు ఉండే వ్యక్తికి ఇంటిపై హక్కు ఉంటుందా.. చట్టం ఏం చెబుతోందంటే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version