https://oktelugu.com/

రెండో భర్త పై కేసు పెట్టిన ప్రముఖ నటి !

తమిళ నటి రాధ తన రెండో భర్త పై ఫిర్యాదు చేసిన వ్యవహారం ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తతంగం నెటిజన్లు ఇంకా మరవకముందే.. నటి రాధ మరోసారి తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశం ఒక్కటే. తన రెండో భర్త తన పై అనుమానం పెంచుకున్నారని, ఆ అనుమానంతో తనని కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని […]

Written By: , Updated On : July 5, 2021 / 12:20 PM IST
Follow us on


తమిళ నటి రాధ తన రెండో భర్త పై ఫిర్యాదు చేసిన వ్యవహారం ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తతంగం నెటిజన్లు ఇంకా మరవకముందే.. నటి రాధ మరోసారి తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశం ఒక్కటే. తన రెండో భర్త తన పై అనుమానం పెంచుకున్నారని,

ఆ అనుమానంతో తనని కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. నిజానికి ఆమె లాస్ట్ టైమ్ కూడా ఇలాగే పిర్యాదు చేసింది. కానీ ఆ తరువాత ఇద్దరు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుని మళ్ళీ తమ దాంపత్య జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. పోయినసారి నేను కేసు పెట్టిన తర్వాత ఆయన కాంప్రమైజ్ అయ్యారు.

దాంతో నేను కూడా ఆయనను నమ్మాను. అప్పటి నుండి ఇద్దరం సంతోషంగా కలిసి జీవిస్తున్నాము. కానీ ఆయన నన్ను మళ్ళీ వేధించడం మొదలు పెట్టాడు, నేను ఎంత ఓర్చుకున్నా ఆయన మాత్రం తన శాడిజాన్ని నా పై బలవంతంగా రుద్దుతున్నాడు అంటూ రాధ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి శనివారం మరోసారి భర్త పై స్థానిక వరంగమలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది.

తన భర్త, ఆయన మిత్రులతో కలిసి తన పై బెదిరింపులకు పాల్పడుతున్నారనేది రాధ ప్రధాన ఆరోపణ. అసలు రాధ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవడమే ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆమె సన్నిహితులు చెబుతున్న మాట. పైగా భర్తతో విడిపోయాక తన కొడుకు, తల్లితో కలిసి ఆమె సంతోషంగా జీవిస్తోంది అని,

కానీ కొద్ది నెలల క్రితం వసంత రాజాను రెండో వివాహం చేసుకుని మళ్ళీ జీవితంలో పెద్ద తప్పు చేసిందని రాధ తల్లి కూడా తన ఆవేదనను వ్యక్తం చేసింది.