Viral : ఫ్యామిలీలో తండ్రి మినహా అందరూ సినీ తారలే. అవును ఆమె తల్లి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆమె సోదరి సైతం హీరోయినే.. అంతేకాదు ఈ అమ్మాయి కూడా కథానాయికగా చేసింది. కేవలం రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అమ్మాయి ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా?
ఆ అమ్మాయి పేరు తులసి నాయర్..ఏంటి ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుందా? అయితే గుర్తుకు వచ్చారన్న మాట.. అవును నిజమే..ఆ అమ్మాయే. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా సాగిన రాధ చిన్నకూతురు తులసి. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ మణిరత్నం మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ విధంగా ‘కాదల్ ’ సినిమాతో హీరోయిన్ గా మారారు తులసి. దీన్నే ‘కడలి’గా తెలుగులో రిలీజ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
తరువాత యాన్ అనే మరో తమిళ సినిమాలో నటించారు. ఇది తెలుగులో రంగం-2 గా విడుదల అయింది. కాకపోతే ఆమె నటించిన రెండు సినిమాలు తగిన గుర్తింపు తీసుకురాలేకపోయాయి. దీంతో తులసి పరిశ్రమకు దూరం అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తులసి కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన అక్క కార్తీక వివాహ సమయంలో తులసి కనిపించారు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది అందాల తార.. కాస్త బొద్దుగా మారడంతో తులసిని తొలుత గుర్తు పట్టలేకపోయారు. కానీ ఆమెకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.