Hyderabad: వావీవరస మర్చిపోతే ఇదిగో ఇలాంటి దారుణాలు జరుగుతాయి

హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో నాలుగు రోజుల క్రితం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి పుస్తకాల సాయికుమార్ (43) హత్యోదంతం కలకలం సృష్టించింది. అతడి దేహంపై గాయాలు ఉండడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించింది.

Written By: Velishala Suresh, Updated On : February 25, 2024 3:01 pm

Hyderabad

Follow us on

Hyderabad: ఏ బంధాని కైనా వావీ వరుస ఉండాలి అంటారు పెద్దలు.. అవి మర్చిపోతే మనుషులకు, జంతువులకు పెద్ద తేడా ఉండదని హెచ్చరిస్తుంటారు. కానీ రోజులు మారుతున్న కొద్దీ మనుషులు వావి వరుసలు మర్చిపోతున్నారు. కా** తో కళ్ళు మూసుకుపోయి జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో నాలుగు రోజుల క్రితం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి పుస్తకాల సాయికుమార్ (43) హత్యోదంతం కలకలం సృష్టించింది. అతడి దేహంపై గాయాలు ఉండడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించింది. పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అతడి మరణం వెనుక జరిగిన పరిణామాలు సభ్య సమాజంలో మనుషుల ప్రవర్తన ఎంత హీనంగా మారుతున్నాయో కళ్ళకు కట్టాయి.

పుస్తకాల సాయికుమార్ వృత్తిరీత్యా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి అమ్ముతుంటాడు. ఇతడికి వరుసకు వదినయ్యే పుస్తకాల రాధ(పేరు మార్చాం) (40) తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈమె భర్త కొంతకాలం క్రితం చనిపోవడంతో తన కుమార్తె రూప(పేరు మార్చాం) (23) తో కలసి హైదరాబాదులో ఉంటోంది. భర్త లేకపోవడంతో రాధకు సాయి కుమార్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే సాయి కుమార్ ఆమెతో వివాహేతర సంబంధం నడుపుకుంటూనే రూప పై కన్నేశాడు. కొంతకాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక రాధ.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని పుస్తకాల దీపక్ కుమార్, యల్లా బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులకు చెప్పింది. అయితే మీరు కూడా ఒక ఘటనకు సంబంధించి గతంలో జైలుకు వెళ్లి వచ్చారు.. దీంతో వారు ఎలాగైనా సాయికుమార్ ను అంతమొందించాలనుకున్నారు.

ఈ నెల 21న రాధ, రూప సాయికుమార్ కి ఫోన్ చేసి వెలుగు గుట్ట సమీపంలోకి రావాలని పిలిపించుకున్నారు. అతడు తన బైక్ మీద అక్కడికి వెళ్ళాడు. సాయికుమార్ రాగానే రాధ అతడిని మాటల్లో పెట్టింది. అదును చూసి రూప కళ్ళల్లో కారం కొట్టింది. అప్పటికే అక్కడ ఉన్న దీపక్, బాలకృష్ణ పదునైన ఆయుధాలతో సాయికుమార్ పై దాడి చేశారు. సాయికుమార్ తీవ్రమైన గాయాలతో పడిపోగా.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. మృతుడి సోదరుడు సాయి కిరణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం రాధ, రూప, దీపక్, బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. భర్త చనిపోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయికుమార్.. వావీ వరుసలు మర్చిపోయి ఆమె కూతురిపై కన్నేశాడు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలు సమాజంలో పతనమవుతున్న విలువలకు తార్కాణంగా నిలుస్తున్నాయి.