
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలక్రిష్ణ అంటే మాస్ కు కేరాఫ్ అడ్రస్. రాయలసీమ ఫ్యాక్షనిజం ఆయనకు సూట్ అవుతుంది. కత్తి పట్టి, తొడగొట్టాడంటే రైలు సైతం వెనక్కి మళ్లాల్సిందే.. పక్కా మాస్ హీరోగా ఉన్న బాలయ్య బాబు క్లాస్ అయిపోతే.. గూగుల్ కు సీఈవోగా మారితే ఎలా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. దాన్నే నిజం చేయబోతున్నాడు దర్శకుడు శ్రీవాస్.
బాలక్రిష్ణతో ఇప్పటికే ‘డిక్టేటర్’ మూవీ తీసిన దర్శకుడు శ్రీవాస్ మరోసారి ఆ కాంబినేషన్ ను సెట్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు బాలయ్య కోసం ‘గూగుల్ సీఈవో’ కథను రెడీ చేశాడట.. ఓ మారుమూల గ్రామం నుంచి గూగుల్ సీఈవో అయ్యి తన శక్తి సామర్థ్యాలను సొంత ఊరికోసం ఖర్చు చేసే ఒక హీరోగా బాలయ్యను చూపించబోతున్నాడట.. సి.కల్యాణ్ నిర్మాత..
ఇప్పటికే ఇలాంటి కథలు తెలుగులో వచ్చాయి. మహర్షి, శ్రీమంతుడు మూవీల కథ అదే. మరి శ్రీవాస్ బాలయ్యను గూగుల్ సీఈవోగా ఎలా చూపించబోతున్నాడు? ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడన్నది తెరపైనే చూడాలి.
అయితే ప్రస్తుతంబాలయ్య ఫుల్ బీజీగా ఉన్నారు. ‘బోయపాటి’తో కలిసి ‘అఖండ’ మూవీ తీశాడు. ఆ తర్వాత గోపిచంద్ మలినేని సినిమా ఓకే అయ్యింది. ఇక అనిల్ రావిపూడి కూడా బాలయ్యకోసం కథను సిద్ధం చేశాడు. ఈ మూడు సినిమాల తర్వాతే బాలయ్య శ్రీవాస్ మూవీ ఉండనుంది.