MS Dhoni Amaravati visit: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అమరావతి రాజధాని ని దేశానికే రోల్ మోడల్ లో నిలపడం కోసం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలను అమరావతి కి తీసుకొచ్చిన చంద్రబాబు, ఇక్కడ ఒక క్రికెట్ అకాడమీ ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ విషయం పై సీఎం చంద్రబాబు తో చర్చలు జరపడం కోసం ప్రముఖ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni) ఈ నెల 9వ తారీఖున అమరావతి కి రాబోతున్నట్టు సమాచారం. మహేంద్ర సింగ్ ధోని ని ప్రభుత్వం తరుపున అతిధి మర్యాదల విషయం లో ఎక్కడా కూడా లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యతని అధికారులకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ లో సీఎం చంద్ర బాబు తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ , క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వంటి వారు కూడా హాజరు కాబోతున్నారట.
Also Read: అకిరా నందన్ హీరో అవ్వాలని ప్రతీ రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను : రేణు దేశాయ్
ఇప్పటికే అమరావతి లో ఒక క్రికెట్ స్టేడియం ని నిర్మించారు. 2014 సమయం లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో ఈ స్టేడియం పనులు చకచకా జరిగాయి. కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్టేడియం ని పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు మరోసారి మరమ్మత్తులు నిర్వహించారు. ఈ స్టేడియం ని కూడా ధోని సందర్శించే అవకాశాలు ఉన్నాయట. దేశవ్యాప్తంగా ఉన్నట్లుగానే, మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ధోని కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ధోని వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానుల ఉత్సాహం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఈ చర్చలు ఫలించి, అమరావతి లో క్రికెట్ అకాడమీ వెలిస్తే మాత్రం అమరావతి క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది.