2 Sisters OTT: డిజిటల్ కంటెంట్ అంతకంతకు ప్రాచుర్యం పొందుతుంది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో మూవీ లవర్స్ ఎక్కువ. ఎక్కడా లేని విధంగా ఇండియాలో అనేక భాషలకు చెందిన చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. దీన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఒకప్పుడు ఇంటిల్లపాది థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం ఆనవాయితీగా ఉండేది.
పెరిగిన టికెట్ ధరలతో పాటు, తక్కువ ధరలకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సబ్స్క్రిప్షన్ ఇవ్వడం, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. దానికి తోడు ఇంట్లో కూర్చుని మనకు కావాల్సిన సినిమా, సిరీస్, కోరుకున్న సమయంలో చూసి ఎంజాయ్ చేయవచ్చు అలాగే వివిధ భాషలు, దేశాలకు చెందిన పాప్యులర్ సినిమాలు, సిరీస్లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మధ్య పోటీ నెలకొంది. మేజర్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో సరికొత్త సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నాయి.
కాగా ఒక బెంగాలీ చిత్రం విశేష ఆదరణ పొందుతుంది. ఆ మూవీ నేమ్ టు సిస్టర్స్. బోల్డ్ కంటెంట్ తో కూడిన ఎమోషనల్ లవ్ డ్రామా ఈ చిత్రం. ఈ మూవీలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వారి పేర్లు షర్మిల, ఉరిమి. వీరి తండ్రి షర్మిలను శశాంక్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. శశాంక్ అనాథ. మంచి వ్యక్తి అనే కారణంగా అమ్మాయిని ఇస్తాడు. ఉరిమి కి కూడా డాక్టర్ సంబంధం చూస్తాడు. అనంతరం కన్నుమూస్తాడు.
ఉరిమిని చేసుకోవాల్సిన వ్యక్తి లండన్ వెళతాడు. అక్కడే సెటిల్ అవుతాడు. ఉరిమిని పెళ్లి చేసుకోనని చెబుతాడు. షర్మిల అనారోగ్యం బారిన పడుతుంది. అక్కను చూసుకునేందుకు ఉరిమి వస్తుంది ఈ క్రమంలో శశాంక్, ఉరుమి దగ్గర అవుతారు. వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఏర్పడుతుంది. అది అక్కకు కూడా తెలుస్తుంది. దీని వలన తర్వాత వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, పర్యవసానాల సమాహారం టు సిస్టర్స్ మూవీ. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.