మనలో చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. నోటి దుర్వాసనా సమస్య వల్ల నలుగురితో కలవాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఉదయం బ్రష్ చేసుకున్నా కొంతమందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా నోటి దుర్వాసన సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే దారాన్ని తీసుకుని చేతి వేళ్ల మధ్యలో పెట్టుకుని దంతమూలాల్లో శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా పళ్లు శుభ్రం కావడంతో పాటు క్రిములు తొలగిపోతాయి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా నోటి దుర్వాసనకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేసుకున్నా నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. ధూమపానం, మధ్యపానం కొన్ని సందర్భాల్లో నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
నోటి దుర్వాసన సమస్య మరీ ఎక్కువగా ఉంటే మౌత్ వాష్ లను ఉపయోగించవచ్చు.సాధారణంగా తాగే నీటితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో నీరు తాగితే దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియా అదుపులో ఉంటుంది. నోట్లో నీళ్లు తరచూ వేసి పుక్కలించినా బ్యాక్టీరియా తొలగిపోతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న జీలకర్ర బ్యాక్టీరియాతో పోరాడి సమస్యకు చెక్ పెడుతుంది.
మెంతులు కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంతో పాటు నోటి దుర్వాసనకు చెక్ పెడతాయి. నిమ్మరసం కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో సహాయడుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో దాల్చిన చెక్క్ బాగా పని చేస్తుంది.